
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile

Bigg Boss 10 Day 1 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్న ఘనంగా మొదలయింది. హౌస్ లోకి 16 మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే 10 స్పెషల్ పవర్స్ పెట్టి ఆ పవర్స్ గెలుచుకోటానికి నిన్నే టాక్సులు పెట్టిన సంగతి తెలిసిందే. త్రిగుణ్, ఝాన్సీ, రామ్ ప్రసాద్, షాలిని పటేల్, నరేష్, సృష్టి, వర్షిణి , నిహార్ లు గెలుచుకున్నట్టు నిన్న చూపించారు.
నేడు మిగిలిన రెండు పవర్ కీస్ ని మిగిలిన వాళ్లలో ఎవరికి ఇవ్వొచ్చో కీస్ గెలుచుకున్న వాళ్ళు డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ అనుకోని వంశీ, కృష్ణుడుకు పవర్ కీస్ ఇచ్చారు. దీంతో వేరే వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వలేదు అని గొడవ పెట్టుకున్నారు. వంశీ, కృష్ణుడు వెళ్లి కీస్ తీసుకున్నారు. అయితే ఈ కీస్ గెలుచుకున్న పది మందికి మాత్రమే బెడ్ రూమ్ యాక్సెస్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు బయటే పడుకోవాలి.
దేబ్జానీ మోదక్ కి నాగార్జున ఇచ్చిన 18 బ్యాడ్జీలు బాక్స్ ని చూసుకుంటూ ఎవరికీ ఏం ఇవ్వాలా అని ఆలోచించుకుంది. సుధీర్ రెడ్డి, ఇంకొంతమంది త్రిగున్ అందర్నీ డామినేట్ చేస్తున్నాడు అని డిస్కస్ చేసుకున్నారు. అనంతరం అందరూ పడుకున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత ఏషనాగుల సాంగ్ వేయడంతో అంతా డ్యాన్స్ వేశారు. రామ్ ప్రసాద్ – దేబ్జానీ అన్నాచెల్లెళ్లు అంటూ కాసేపు ఎమోషన్ పండించారు. అనంతరం వంట చేసుకున్నారు. దేబ్జానీ మైక్ బ్యాటరీ మార్చుకోవడం మర్చిపోయింది. దాంతో బిగ్ బాస్ ని కాకా పట్టింది. త్రిగున్ కి దయ్యాలు ఉన్నాయని నమ్మించమనే టాస్క్ ఇచ్చారు కాబట్టి ఆ పనిలో ఉన్నాడు. సుధీర్ రెడ్డి సృష్టిని ఫ్లర్ట్ చేసే పనిలో ఉన్నాడు. రామ్ ప్రసాద్ – నరేష్ నామినేషన్స్ కోసం మాట్లాడుకున్నారు. దేబ్జానీ ని బిగ్ బాస్ తనపై అభిప్రాయం ఏంటి అని అడిగాడు. కాసేపు దేబ్జానీ – బిగ్ బాస్ మాట్లాడుకున్నారు.
Also See : Jabardasth Ram Prasad : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఆటో రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
అనంతరం బిగ్ బాస్ పవర్ కీస్ గెలుచుకున్న వాళ్లలో ఒక్కొక్కరిని పిలిచి పవర్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోమన్నాడు. దాంతో అందరూ తమకు వచ్చిన బాక్స్ లను ఓపెన్ చేసుకొని వాళ్లకు వచ్చిన పవర్స్ తెలుసుకున్నారు.
త్రిగున్ కి వచ్చిన పవర్.. వేరే ఎవరైనా ప్లేయర్ తన పవర్ ని వాడినప్పుడు త్రిగున్ తన పవర్ వాడి ఆ పవర్ ని తీసేసుకోవచ్చు. అయితే అలా తీసుకున్న పవర్ ని వెంటనే వాడాలి.
ఝాన్సీ – వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్ లో ఏ రోజైన ఈ పవర్ ని వాడొచ్చు. ఎలిమినేషన్ భయం ఉంటే ఇది వాడొచ్చు. దాంతో ఝాన్సీ ఆ వారానికి ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుంది.
నీహార్ – ఎవరి పవర్ అయినా వాడేసిన తర్వాత వాళ్లకు ఆ పవర్ మళ్ళీ రావాలంటే నీహార్ ఆ పవర్ ని ఇవ్వొచ్చు.
వర్షిణి – కీ ఓపెన్ కి కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. బిగ్ బాస్ తోనే ఫ్లర్ట్ చేసింది. వర్షిణికి ఏ ప్లేయర్ టాస్క్ గెలిచినా ఆ ప్లేయర్ గెలుపుని కావాలనుకున్నప్పుడు సొంతం చేసుకోవచ్చు అని వచ్చింది.
కృష్ణుడు – ఎలిమినేషన్ సమయంలో తప్ప ఎప్పుడైనా, ఏ ప్లేయర్ ప్లేస్ ని అయినా స్వాప్ చేసుకోవచ్చు. లేదా వేరే ఇద్దర్ని అయినా స్వాప్ చేయవచ్చు.
షాలిని – ఏ ప్లేయర్ కి అయినా నచ్చిన హౌస్ డ్యూటీ ఇవ్వొచ్చు. ఆ ప్లేయర్ అదే డ్యూటీ చేయాలి.
సృష్టి – ఏ ప్లేయర్ ని అయినా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేసినవాళ్లు డైరెక్ట్ నామినేషన్ లో ఉంటారు.
రామ్ ప్రసాద్ – నామినేషన్ లో రామ్ ప్రసాద్ లేదా, తనకు నచ్చిన వాళ్ళను సేఫ్ చేయొచ్చు.
టెంపర్ వంశీ – ఏ ప్లేయర్ ని అయినా రెండు వారాల పాటు కెప్టెన్సీ లేకుండా చేయొచ్చు.
నరేష్ – తన ఓటు విలువ రెండు రేట్లు. ఏ ప్లేయర్ పైన అయినా వాడొచ్చు, ఆ ప్లేయర్ కి వ్యతిరేకంగా నామినేషన్స్ లో. కాసేపు నరేష్ తో బిగ్ బాస్ ఆడుకున్నాడు.
Also Read : Bigg Boss Telugu 10 Day 1 Promo : బిగ్ బాస్ డే 1 కొత్త ప్రోమో వచ్చేసింది.. ఆ పది పవర్స్ చుట్టే ఆట అంతా..<
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
