
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
సీనియర్ నటి మేనక సురేష్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మలయాళ చిత్రసీమలోకి పునరాగమనం చేయడం విశేషం. `ఒరు కొరియన్ కన్ఫ్యూజన్` అనే వినూత్న శీర్షికతో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా మేనక మాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎనభైల నాటి తరం ప్రేక్షకులను సహజసిద్ధమైన నటనతో అలరించిన మేనక మళ్ళీ వెండితెరపై కనిపించబోతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేనక సురేష్ మలయాళ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు.
1980వ దశకంలో ఎన్నో చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలతో తెరను పంచుకున్నారు. అప్పటి తరం ప్రేక్షకులకు మేనక అందించిన పాత్రలు ఇప్పటికీ నటనకు చిరునామాగా నిలిచాయి. కుటుంబ కథా చిత్రాలకు , భావోద్వేగ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మేనక పెట్టింది పేరుగా ఓ వెలుగు వెలిగారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే నిర్మాత జి. సురేష్ కుమార్ను వివాహం చేసుకుని అటుపై నటనకు కొంతకాలం విరామం ఇచ్చారు.
కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం.. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మేనక ప్రధాన పాత్ర పోషించారు. దీంతో పరిశ్రమకు దూరమయ్యారు. అయినా చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధం, సినిమాపై ఉన్న మక్కువ ఆమెలో ఎప్పుడూ తగ్గిపోలేదనడానికి ఈ పునరాగమనమే నిదర్శనం. మేనక సురేష్ నటనతో పాటు ఆమె కుటుంబం కూడా మలయాళ సినీ జగత్తులో ఎంతో పేరు సంపాదించింది. ఆమె కుమార్తె కీర్తి సురేష్ దక్షిణాది వ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకున్నారు.
కుమార్తె సాధించిన విజయాలు ఆనందాన్ని ఇస్తున్న సమయంలోనే మేనక మళ్లీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకోవడం ఆమె అంకితభావాన్ని చాటుతోంది. `ఒరు కొరియన్ కన్ఫ్యూజన్` చిత్రంలో మేనక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మేనక పాత్ర చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటి కావడంతో ఆమె కనిపించే ప్రతి సన్నివేశం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం మలయాళ చిత్రసీమలో కొత్త తరహా కథాంశాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మేనక సురేష్ వంటి అనుభవజ్ఞురాలు రీ-ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీకి ప్లస్ పాయింట్ కానుంది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నటిగా సరికొత్త శిఖరాలను అందుకోవాలని ప్రేక్షకాభిమానలు ఆకాంక్షిస్తున్నారు.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Tupaki లో చూడండి