
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile

OnePlus Nord CE 6 Price : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి బిగ్ న్యూస్.. మెమరీ చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగాపెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడమే కష్టం.. అలాంటి ఇప్పుడు వన్‌ప్లస్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6పై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.
ఈ ఫోన్ అసలు ధర రూ. 37,999 ఉండగా ప్రస్తుతం రూ. 2వేలకు పైగా తగ్గింపుతో లభ్యమవుతోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఇంకా తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్సెట్ కూడా ఉంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 6 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 కేవలం రూ. 35,732కే లభిస్తోంది. అసలు ధర రూ. 37,999 ఉండగా రూ. 2,267 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా రూ. 1,787 తగ్గింపు పొందవచ్చు. తద్వారా అసలు ధర రూ. 33,945కు తగ్గుతుంది. ఈ బ్రాండ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. 36 నెలల్లో నెలకు కేవలం రూ. 1,256 నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి