
అనిల్ కపూర్(Anil Kapoor) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్(Sonam Kapoor) కెరీర్ మొదటి నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిన సోనమ్ పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా సోనమ్ రీసెంట్ ఫోటోలు ఇన్‌స్టాలో కనిపించగా వాటిని చూసి నెటిజన్లు తెగ లైకులు కొడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ఆమె బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ ను ధరించి దానికి తగ్గట్టు హెవీ చోకర్ ను మెడలో వేసుకుని రాయల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ అవుట్‌ఫిట్ లో సోనమ్ మరింత అందంగా కనిపిస్తోంది.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk





