
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile

Telangana Ministers Met Governor: తెలంగాణ రాజకీయాల్లో దళిత ఆత్మగౌరవం అంశం మళ్ళీ తీవ్ర దుమారం రేపుతోంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎర్రవల్లిలో దళితులు నిరసన తెలిపిన స్థలంలో శుద్ధీకరణ చేపట్టి అహంకారంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తెలంగాణ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్, వివేక్, వాకిటి శ్రీహరి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్(Telangana Ministers Met Governor) శివప్రతాప్ శుక్లాను కలసి బీఆర్ఎస్ వైఖరిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Bullet Train Corridor: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. తొలి స్టేషన్ ఎక్కడో తెలుసా.. రూట్ మ్యాప్ ఇదే
మరోవైపు, స్పీకర్‌ను దూషించడంపై శాసన మండలి ఎథిక్స్ కమిటీ కూడా తీవ్రంగా పరిగణించింది. కమిటీ ఛైర్మన్ మహేష్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలతో పాటు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తన అంశంపై విస్తృతంగా చర్చించారు. రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న దళిత నేతలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో తేల్చేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రంగంలోకి ఎథిక్స్ కమిటీ: న్యాయసలహా దిశగా విచారణ:
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి




