
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Home » NRI » Chandrababu Naidu arrest anniversary tdp australia sydney Nijam gelichindi program pcs
ఆస్ట్రేలియా టీడీపీ విభాగం ప్రెసిడెంట్ శశి ఆలపాటి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఘటన జరిగి మూడేళ్లు పూర్తైన నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా టీడీపీ విభాగం ప్రెసిడెంట్ శశి ఆలపాటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించడానికి నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు గుర్తుగా సిడ్నీ నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ శశి ఆలపాటి, రాగక్రాంతి గుమ్మడి, రాజేశ్వరి కిలారు, రంజిత్ కావూరి, హరి వడ్లపట్ల, బాల మైనేని, వెంకట్ చిట్టూరి, నాగ కృష్ణ చలసాని, సుధాకర్ ఎంటూరి, ప్రసాద్ మందలపు, అజిత్ వీరపనేని, సూర్య పొట్లూరి, రవి కొడాలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిజం గెలిచిందని నినదించారు.
తానా ఒహాయో వ్యాలీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమం..
బాక్సింగ్ రాణి నిఖత్ జరీన్‌కు ఖతర్‌లో సన్మానం
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Andhra Jyothy లో చూడండి






