
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile

TGLPRB Recruitment 2026 : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. 7,437 పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.
Also Read : 13day Old Baby Passport : 13 రోజుల పసికందుకు పాస్‌పోర్ట్.. ఆంధ్రప్రదేశ్ చిన్నారి సరికొత్త రికార్డు! ఆ చిన్నారి కథ ఇదే..
జులై 29న 7,437 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఏఆర్ పీపీఎల్ మెన్ కానిస్టేబుల్ 24, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1,380, ఫైర్‌ఫైటర్ 751, జైలు వార్డర్ 208 పోస్టులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 9 వరకు గడువు ఇచ్చారు. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన, దరఖాస్తు ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని గడువును మరో వారం రోజులపాటు పొడిగిస్తూ పోలీస్ నియామక మండలి నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. వీరిలో 2,88,530 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. మరోవైపు అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియకూడా 95శాతానికి పైగా పూర్తయినట్లు బోర్డు వెల్లడించింది.
దరఖాస్తు గడువు పొడిగించినప్పటికీ అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి చూడవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. చివరి నిమిషంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
ఇదిలాఉంటే.. తెలంగాణలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగ యువత నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఇప్పటికే, మూడు లక్షలకుపైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగాలపై ఉన్న ఆసక్తి స్పష్టమవుతోంది. తాజాగా దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16 సాయంత్రం 5గంటల వరకు పొడిగించడంతో మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభించింది.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి








