translateexpand_more

Amit Shah News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 12:07 pm
అమిత్ షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shan)ను మంగళవారంనాడిక్కడ కలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు. ఆ వెంటనే అమిత్‌షాను కూడా కలుసుకోవడంతో ఆయన కొత్త పార్టీని స్థాపించేందుకు నిశ్చయించుకున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. అయితే కొత్త పార్టీ ఆలోచనను అన్నామలై ఇంతవరకూ అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.

న్యూఢిల్లీ పర్యటనలో అన్నామలైను పార్టీలోనే కొనసాగాలని బీజేపీ అధిష్ఠానం కోరిందని, రాజ్యసభ సీటు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేంతవరకూ ఢిల్లీలోనే ఉండాలని సూచించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై సైతం తన నిర్ణయాన్ని రెండ్రోజుల్లో తెలియజేస్తానని ఢిల్లీకి బయలుదేరే ముందు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

మరోవైపు, అన్నామలై మరో కొత్త అవతారం ఎత్తాలని, తమిళనాడును కాపాడాలని కోరుతూ మదురై, కోయంబత్తూరులో రెండ్రోజుల క్రితం పోస్టర్లు వెలిసాయి. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజున ఆయన నుంచి ఒక కీలక ప్రకటన ఉంటుందని అన్నామలై అనుచరులు చెబుతున్నారు. అన్నామలై గత కొంతకాలంగా పలు అంశాల విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై మొదట్నించీ ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ టిక్కెట్‌ను కూడా నిరాకరించి ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే ప్రచారంలోనూ ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదని అన్నామలై వర్గీయులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానంతో అన్నామలై బహిరంగంగానే విభేదించారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర విద్యాశాఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన కోరారు. ఈ క్రమంలో సుహృద్భావ వాతావరణంలోనే పార్టీ నుంచి తప్పుకుని సొంత మార్గాన్ని ఎంచుకోవాలని అన్నామలై గట్టి నిశ్చయానికి వచ్చినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

Vaartha02 Jun, 11:50 am
బీజేపీకి అన్నామలై రాజీనామా.. కొత్త పార్టీ వైపు అడుగులు

Tamil Nadu BJP Leader: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఆ పార్టీకి మంగళవారం (జూన్ 2) రాజీనామా చేశారు. గత రెండు రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారనే ఊహగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన అనంతరం అన్నామలై తన రాజీనామా లేఖను సమర్పించారు. నితిన్ నబీన్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు ఐదు పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను ఆయన అందజేశారు. అయితే, అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం మాత్రం ఇప్పటివరకు ఆమోదించలేదు. Read Also : IMD On Monsoon : వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు బీజేపీని వీడిన అన్నామలై.. భవిష్యత్తులో కొత్తగా ఒక రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 4న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన తన రాజకీయ భవిష్యత్తు మరియు కొత్త ప్రణాళికలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మాజీ ఐపీఎస్ అయిన అన్నామలై ‘లౌకిక’, ‘తమిళ-కేంద్రీకృత’ దృక్పథంతో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని గట్టిగా యోచిస్తున్నారు. ప్రతిపాదిత ఈ కొత్త పార్టీని రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే, అన్నాడీఎంకే ద్రావిడ పార్టీలతో పాటు బీజేపీకి కూడా ప్రత్యామ్నాయంగా ఈ పార్టీని నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవించి, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను సమస్యల ఆధారంగా గట్టిగా వ్యతిరేకించే ఒక బలమైన రాజకీయ వేదికను అన్నామలై ఊహించుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తమిళనాడులో పార్టీ రాజకీయ వ్యూహాలు, విధానాల విషయంలో అన్నామలైకి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే తో పొత్తును పునరుద్ధరించడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికతో సహా పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పొత్తులపై పదే పదే ఆధారపడటం కంటే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి ఒక స్వతంత్ర సంస్థాగత పునాదిని నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టాలని అన్నామలై గట్టిగా వాదించారు. కానీ, జాతీయ నాయకత్వం మాత్రం విస్తృతమైన డీఎంకే (DMK) వ్యతిరేక వ్యూహానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే సమయంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన పనితీరు తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నామలై సహచరులు పేర్కొంటున్నారు. సాంప్రదాయ ద్రావిడ పార్టీలకు భిన్నంగా కొత్త రాజకీయ శక్తులకు తమిళనాడులో ఇప్పుడు స్పష్టమైన ఆస్కారం ఏర్పడిందని, అందుకే అన్నామలై ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Swimming: స్విమ్మింగ్ చేస్తున్నారా? చర్మం పాడవకుండా ఉండాలా.. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. CM Yogi : స్నేహం ముసుగులో దాడులా? సహించేది లేదు:: సీఎం ఆదిత్య‌నాథ్‌ Generation Z: సమాజంలో మార్పు జనరేషన్ జెడ్తోనే సాధ్యం IMD On Monsoon : వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు Examination system : నమ్మకం సడలుతున్న పరీక్షా వ్యవస్థ! DK Shivakumar to take oath : కర్ణాటక సీఎంగా రేపు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... రాశి ఫలాలు – 02 జూన్ 2026 మేష రాశి మీరు లాభాలు వస్తాయని ఆశించి... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... తెలంగాణలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది.

10TV Telugu02 Jun, 09:50 am
బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్ కు రాజీనామా లేఖ అందజేత

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, అన్నామలై రాజీనామా విషయంపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. Also Read : Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే.. అన్నామలై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు బీజేపీలో అధ్యక్ష మార్పు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో అన్నామలై స్థానంలో నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా అన్నామలై ప్రముఖ పాత్ర పోషించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర ఓటమి తరువాత అన్నామలై బీజేపీ వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి అందజేసినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అన్నామలై భేటీ అవుతారని తెలిసింది. ఆ భేటీ తరువాత అన్నామలై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అన్నామలై మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.

Amit Shah News Keyword | Telugu Digital