
Dadasaheb Phalke Award | సహజమైన నటనకు చిరునామా.. అనంత్‌నాగ్‌కు ఫాల్కే పురస్కారం
భారతీయ చలన చిత్రసీమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను బుధవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌నాగ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరిగే 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.


