
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heart Health Tips: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె అతి ముఖ్యమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే లైఫ్‌స్టైల్, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా ముఖ్యం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాల్‌నట్ లేదా బాదం ఈ రెండింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 నుంచి 5 బాదం లేదా 2 నుంచి 3 వాల్‌నట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 2. ఓట్స్ ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతువు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీటిలో ఓట్స్ ఉడికించి తింటే మంచి ఫలితాలు అందుతాయి. వాటిలో కొద్దిగా తేనె, డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు. 3. అవకాడో అవకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీగా లేదా సలాడ్‌గా కలిపి తీసుకోవచ్చు. 4. చిక్కుడు వర్గపు మొలకలు మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం,














