translateexpand_more

Hema News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy30 May, 02:47 pm
దాసరి విగ్రహానికి నమస్కరిస్తూ.. హేమ ఏం కోరిక కోరిందో తెలుసా

దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని (Dasari Narayana Rao Death Anniversary) పురస్కరించుకుని శనివారం టాలీవుడ్‌లో ఎలాంటి హడావుడి నడిచిందో.. అంతా చూస్తూనే ఉన్నారు. దాసరి ఘాట్‌ని క్లీన్ చేసే విషయంలో మంచు విష్ణు, మనోజ్ తెగ ఉత్సాహం ప్రదర్శించారు. మంచు మనోజ్ (Manchu Manoj) ఘాట్ దగ్గర ఉండి కాసేపు క్లీనింగ్ పనులు చేయిస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఒక ప్రకటనతో.. క్రెడిట్ మొత్తం నాదే అని అనిపించుకోవాలనుకున్నారు. అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ గురువుగా భావించి, పిలిచే దాసరి నారాయణరావు ఘాట్‌ అంత అధ్వాన్నంగా ఉండడం చూసి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అనేలా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇక మంచు బ్రదర్స్ అనంతరం నటి హేమ (Actress Hema) సీన్‌లోకి వచ్చారు.

‘ఇదంతా చూస్తుంటే.. ఈ రోజు నా వర్ధంతి.. అందరూ నన్ను మరిచిపోయారా!’ అని గురువుగారు మాకు గుర్తు చేసినట్లుంది అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె.. ‘‘అందరికీ నమస్కారమండి, నేను మీ హేమని. ఈరోజు గురువుగారి వర్ధంతి.. అది నాకు అసలు మైండ్‌లో కూడా లేదు. అయితే, నిన్న ఒక వీడియో చూడగానే.. ‘అయ్యో! ఏంటి ఇలా ఉందా?’ అని చెప్పి భయపడి, కాల్ చేసి, లొకేషన్ షేర్ చేయించుకుని, నాతో పాటు ఒక నలుగురు మనుషులను ఎక్కించుకుని, పరిగెత్తుకుంటూ.. ఇక్కడ క్లీన్ చేయించడానికి వచ్చానండి.

‘హలో, ఏంటి అందరూ నన్ను మరిచిపోయారా? ఇవాళ నా వర్ధంతి అని ఆయనే మాకు గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది’. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేనేమో ఇక్కడికి భయపడుతూ వచ్చాను. ఎలాగా, ఏం

Asianet News Telugu30 May, 03:37 pm
రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు

నటి హేమ ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. మంచి కామెడీ పాత్రలతో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా రాణించి మెప్పించింది. ఆద్యంతం అలరించింది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెకి సినిమా ఆఫర్లు లేవు. ఆమె చేయడం లేదా? ఆమెకి రావడం లేదా? ఏం జరుగుతుందో ఏమోగానీ.. హేమ ఇటీవల కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంది. దాసరి నారాయణరావు సమాధి వద్ద తన మనసులో కోరికలను బయటపెట్టింది. దాసరి నారాయణ రావు వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సమాధిని సందర్శించింది నటి హేమ. దాసరి సమాధిని ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం క్లీన్‌ కూడా చేయడం లేదని మంచు మనోజ్‌ వాపోయాడు. ఆయన స్వయంగా వెళ్లి తన మనుషులతో క్లీన్‌ చేయించాడు. నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నటి హేమ్‌ కూడా అక్కడికి వెళ్లి దాసరి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ, ఈ రోజు గురువుగారి వర్థంతి అనేది కనీసం మైండ్‌లో కూడా లేదు. ఓ వీడియో చూసినప్పుడు అయ్యో ఆయన సమాధి ఇలా ఉందా అనిపించింది. అందుకే కొందరు మనుషులను తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే, అంతా నీట్‌గా బాగా చేసి ఉంది. గురువుగారే మాకు తన వర్థంతిని గుర్తు చేసి తమతో ఇలా చేయించుకున్నారనిపిస్తుంది. గురువుగారు ఉండి ఉంటే నా లైఫ్‌ మరోలా ఉండేది. చనిపోయాక కూడా మాకు గుర్తు చేసి ఇక్కడికి వచ్చేలా చేశారు. గురువుగారు నేను సినిమాల్లో బిజీ కావాలని, మంచి రాజకీయ నాయకురాలిని కావాలని ఆశీర్వదించండి ` అని తెలిపింది హేమ. మొత్తంగా తన మనసులో మాటని బయటపెట్టింది హేమ. సినిమా