
స్టూడెంట్స్, గేమర్స్ కి సూపర్ ఛాయిస్.. టాబ్లెట్ డిస్ ప్లేతో కొత్త హువావే ఫోన్.. ప్రీ-ఆర్డర్లు స్టార్ట్
ఈ స్మార్ట్ఫోన్లో 6,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ డిస్ప్లే 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ 7,000 mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ Huawei Pura X View : హువావే ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త హువావే పురా ఎక్స్ వ్యూ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ చూసేందుకు అచ్చం టాబ్లెట్ మాదిరి డిస్ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ భారీ డిస్ ప్లే కారణంగా గేమర్లకు, విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులోని డిస్ప్లే టాప్ 6,500 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హువావే పురా ఎక్స్ వ్యూలో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. హార్మొనీఓఎస్ 7.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఆగస్టు 28 నుంచి సేల్ : హువావే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యు చెంగ్డాంగ్ ప్రకారం.. హువావే పురా ఎక్స్ వ్యూ ఆగస్టు 28 నుంచి అమ్మకానికి వస్తుంది. చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 12GB+ 512GB, 12GB + 1TB స్టోరేజ్ ఆప్షన్లలో కూడా లభించనుంది. హువావే పురా ఎక్స్ వ్యూ వైట్, రెడ్, యాష్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Read Also : OnePlus 15R Offer : ఈ వన్ప్లస్ ఫోన్ మీ బడ్జెట్ ధరలో.. ఇలా కొంటే రూ. 3వేలు తక్కువకే..! ఈ స్మార్ట్ఫోన్లో 6.39-అంగుళాల డిస్ప్లే (1,320 x 2,232 పిక్సెల్స్), 2,160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ 6,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ ఉన్నాయి. ఈ డిస్ప్లేకు 4 వైపులా 1.05మి.మీ. బెజెల్స్ ఉన్నాయి. వీడియోలు, స్టడీ, గేమ్స్ ఆడేందుకు ఈ స్మార్ట్ఫోన్ వైడ్ డిస్ప్లే అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్