
నా భార్య పేరు ఎత్తే సాహసం చేయొద్దు
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మిషిగన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్‌ను ఉద్దేశించి ఎల్-సయెద్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘నీ నోటితో నా భార్య పేరు ఎత్తొద్దు’’ అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. మిషిగన్‌లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతుగా సోమవారం జరిగిన మాగా కంపెనీ ర్యాలీలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-సయెద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా భార్య పేరును నీ నోటితో ఎత్తొద్దు. నీ స్థాయికి అందనంత దూరంలో ఆమె ఉంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్-సయెద్ చాలా చాలా చెడ్డ వ్యక్తి అంటూ విమర్శించారు. ఎలా మొదలైంది? ఎల్-సయెద్ గతంలో షరియా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వాన్స్ ఇటీవల విమర్శించారు. అమెరికా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే ఓ రాజకీయ నాయకుడు షరియా చట్టానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన దివంగత తాతను గుర్తుచేసుకున్న వాన్స్.. ‘‘ఇది నా తాతకు తెలిసిన డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అబ్దుల్ ఎల్-సయెద్ Abdul El Sayed.. వాన్స్ తన తాత గురించి మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆయన భార్య ఉషా వాన్స్ పేరును ప్రస్తావించారు. ‘‘జేడీ ఉషాను కూడా తనతో పాటు గతంలోకి తీసుకెళ్లి తాతను కలిపిస్తారా?’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎల్-సయెద్కు ఓ విచిత్రమైన అలవాటుగా మారిందని విమర్శించారు. ఇకపై తన భార్య పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించారు. ‘చాలా చాలా చెడ్డ వ్యక్తి’ ఎల్-సయెద్పై వాన్స్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వర్గం ప్రయోజనాల కోసం మిగిలినవారిని పట్టించుకోని రాజకీయ