translateexpand_more

Ram Charan News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 03:10 pm
పెద్ది' ట్రైలర్ పై ట్రోలింగ్.. అయితే సరైన దారిలోనే ఉన్నాం.. బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్

BuchiBabu Sana: ‘ఉప్పెన’ వంటి అందమైన ప్రేమకథ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు(BuchiBabu Sana) స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ఈ భారీ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా పాటలకు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో పోలిస్తే, ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంపై కాస్త కలవర పరిచింది. ఈ విషయం పెద్ది టీం వరకు కూడా వెళ్లిందట. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయంపై స్పందించారు. Buchibabu sana: ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు.. ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు కీలక ప్రకటన ట్రైలర్‌లోనే కథను ఎక్కువగా చూపిస్తే థియేటర్స్ లో ఆ ఉత్కంఠ తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే అలా చేశామని బుచ్చిబాబు వివరించారు. సినిమాలోని అత్యంత కీలకమైన 50 నిమిషాల ఫుటేజీని ట్రైలర్ కోసం అసలు తాకనే లేదని, అందుకే ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇందులో కనిపించలేదని పేర్కొన్నారు. గతంలో ఘన విజయం సాధించిన ఎన్నో చిత్రాల ట్రైలర్లు కూడా ఆరంభంలో యావరేజ్‌గానే అనిపించాయని, కాబట్టి తాము సరైన దారిలోనే వెళ్తున్నామని నవ్వుతూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా కథను తాను ‘ఉప్పెన’ విడుదల కాకముందే సిద్ధం చేసుకున్నానని బుచ్చిబాబు వెల్లడించారు. రామ్‌చరణ్‌కు ఈ కథ వినిపించగా, ఆయన చిన్న మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే అన్నారని గుర్తుచేసుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం మొదట ఖుషీ కపూర్‌ను అనుకున్నప్పటికీ, ఆమె మరీ చిన్నమ్మాయిలా కనిపిస్తుందనే కారణంతో.. చివరకు ఆమె సోదరి, ప్రముఖ నటి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.

NTV Telugu02 Jun, 12:29 pm
స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టిన బుచ్చిబాబు

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై ఉన్న శ్రద్ధను, ఆమె సింప్లిసిటీని కొనియాడుతూ బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా అసిస్టెంట్ డైరెక్టర్లను పట్టుకుని తెలుగు నేర్చుకుంది.. జాన్వీ కపూర్ ఎంత స్మార్ట్ అండ్ టాలెంటెడో చెప్తూ బుచ్చిబాబు ప్రశంసలు కురిపించారు. "జాన్వీ కపూర్ చాలా తెలివైనది. నిన్న జరిగిన ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడడం కోసం ఆమె మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర తెలుగు నేర్చుకుంది. లొకేషన్‌లోనే కాకుండా ప్రమోషన్లలోనూ ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ నిజంగా గ్రేట్" అని బుచ్చిబాబు కొనియాడారు. అంతేకాదు ఈరోజు ప్రెస్ మీట్ ఉందనగానే జాన్వీ కపూర్ ఎంతో సరదాగా స్పందిస్తూ.. "ఈరోజు మళ్లీ ప్రెస్ మీట్ ఉందా.. నిన్నటితో నాకున్న తెలుగు అంతా అయిపోయింది" అని తనతో అన్నట్లు బుచ్చిబాబు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి కూతురిని అనే పొగరు ఇసుమంత కూడా లేదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, జాన్వీ కపూర్ లొకేషన్‌లో ఎంత ఒదిగి ఉంటుందో బుచ్చిబాబు వెల్లడించారు. "స్టార్ కిడ్ అనే అహంకారం, శ్రీదేవి గారి కూతురిని అనే పొగరు ఆమెలో ఇసుమంత కూడా కనిపించదు. అందరితో ఎంతో మర్యాదగా, వినయంగా ఉంటుంది" అని జాన్వీ రియల్ క్యారెక్టర్‌‌ను బుచ్చిబాబు రివీల్ చేశారు. గతంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జాన్వీ కపూర్, ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ పక్కా లోకల్ క్యారెక్టర్‌తో అలరించబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

NTV Telugu02 Jun, 12:02 pm
మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని, కనీసం నిద్రను కూడా పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన బిజీ షెడ్యూల్ చెప్పి షాక్ ఇచ్చారు. మ్యారేజ్ డే రోజు కూడా .. సినిమా ప్రమోషన్స్ కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో ఆయన మాటల్లోనే స్పష్టమైంది. "ఈరోజు నా వెడ్డింగ్ యానివర్సరీ (పెళ్లి రోజు).. కానీ కనీసం ఆ విషయం కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నాను. గత మూడు రోజుల నుంచి అసలు తారీఖులను కూడా చూడడం లేదు. నిద్ర కూడా లేకుండా కేవలం 'పెద్ది' ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే మునిగిపోయాను" అని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక దర్శకుడికి తన సినిమాపై ఉన్న ప్యాషన్, డెడికేషన్‌కు ఈ సంఘటనే ఒక నిదర్శనమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మీరు హిట్ అంటేనే నాకు హ్యాపీ.. తన కష్టమంతా ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ పైనే ఆధారపడి ఉందంటూ బుచ్చిబాబు భావోద్వేగానికి గురయ్యారు. "నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర లేదు అనేది ముఖ్యం కాదు. జూన్ 4న థియేటర్లలో మీరు సినిమా చూసి 'హిట్' అయిందని చెప్తే చాలు.. అదే నాకు అసలైన హ్యాపీనెస్, నా కష్టానికి దక్కే నిజమైన ప్రతిఫలం" అని అన్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు పవర్‌ఫుల్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. మరి తన పెళ్లి రోజును సైతం పక్కనపెట్టి బుచ్చిబాబు పడిన కష్టానికి, రామ్ చరణ్ చూపించిన డెడికేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబోతుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

10TV Telugu02 Jun, 11:58 am
చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్

Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్‌లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్‌గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

SkyC Media02 Jun, 11:45 am
పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం పెద్ది. ఈ సినిమాకు సంబంధించిన పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని తిరిగి రాబట్టడం విశేషం. నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా కోసం 350 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుత మార్కెట్ లో ఒక పెద్ద సినిమా విడుదలకు ముందే పూర్తి బడ్జెట్ రికవరీ చేయడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పక్కా ప్రణాళికతో నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరలకు విక్రయించారు. దీంతో శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్ హక్కుల రూపంలో నిర్మాతలకు భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ ఒప్పందాలు కూడా ఊహించని రీతిలో భారీ స్థాయిలోనే ముగిశాయి. ఫలితంగా సినిమా విడుదలకు ముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తం 100 శాతం రికవరీ అయిపోయింది. ఈ బిజినెస్ క్లోజ్ అవ్వడంతో పెద్ది నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా అప్పుడే లాభాల్లోకి వచ్చేసారు. ఫలితంగా జూన్ 4 నుండి థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లు అన్నీ నిర్మాతలకు నికర లాభాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ప్రస్తుత పోటీ మార్కెట్ లో ఇటువంటి బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వడం నిజంగా పెద్ద రికార్డు అని చెప్పాలి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచుతోంది. రాబోయే రోజుల్లో థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించే వసూళ్లు ఈ లాభాల శాతాన్ని మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం సాధించిన ప్రీ రిలీజ్ విజయం టాలీవుడ్ లోని ఇతర పెద్ద సినిమాలకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. రామ్ చరణ్ క్రేజ్ కారణంగానే బిజినెస్ వర్గాల్లో ఈ స్థాయి డిమాండ్ ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతోంది. జూన్ 4 న థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Chitrajyothy02 Jun, 10:29 am
దేవుడా.. రామ్ చరణ్ బాడీగార్డ్ మామూలోడు కాదు బాబోయ్

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కి అదృష్టం వరించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. అతనే కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాడీగార్డ్ కే బాడీగార్డ్ కావాల్సివస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కె కుంట (Kevin K Kunta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది.

తాజాగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షాక్ అయ్యింది. అంతలా కెవిన్ ఏం చేశాడంటే.. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. హీరోల వీరాభిమానులు అందరిని దాటుకొని హీరోల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి బాడీగార్డ్ లు వస్తారు. వారిని పక్కకు నెట్టి హీరో ఆ అభిమానికి సెల్ఫీ ఇస్తాడు. ఇది ప్రతిసారి జరిగేదే. కానీ, ఈసారి.. చరణ్ దగ్గరకు ఆ అభిమానిని పోనివ్వకుండా మధ్యలోనే కెవిన్ అడ్డుపడ్డాడు. అంతేకాకుండా అతడిని ఒక ఉదుటున ఎత్తిపట్టుకొని ఆమడ దూరంలో పడేశాడు. ఒక మనిషిని ఆ రేంజ్ లో ఎత్తుకొని పక్కన పడేయడం చూసిన జాన్వీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అసలు కెవిన్ అలా ఎలా చేయగలిగాడు .. ఇతను మామూలోడు కాదు బాబోయ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే కెవిన్ మామూలోడు కాదు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తూ అక్కడ ప్రొఫెషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా రికార్డులు సృష్టించాడు. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌ గా నిలిచిన కెవిన్, ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో పవర్‌ఫుల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. కేవలం రింగ్ లోపలే కాకుండా, రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, అంతర్జాతీయ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఆ రేంజ్ రికార్డు ఉండబట్టే చరణ్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నాడు. కెవిన్ కి నెలకు రూ 4 లక్షల జీతమని టాక్. ఇక తన బాడీగార్డ్ గురుంచి చరణ్ సైతం చెప్పుకొచ్చాడు. కెవిన్ ని తన కోసం కాదని.. పిల్లల కోసం నియమించినట్లు తెలిపాడు. ఏదిఏమైనా నాలుగేళ్లుగా చరణ్ కి సెక్యూరిటీగా ఉంటున్న కెవిన్ కి ఇప్పుడు గుర్తింపు వచ్చింది.

10TV Telugu02 Jun, 07:00 am
జనసేన కోసం రామ్ చరణ్ త్యాగం.. బాబాయ్ కోసమే అబ్బాయి తప్పుకున్నాడా

Ram Charan : పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుండగా నిన్న జూన్ 1న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేడు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హోటల్ లో మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రెస్ మీట్ నిర్వహిద్దామని ప్లాన్ చేసారు. మూవీ యూనిట్ అంతా దీనికి హాజరు కావాల్సి ఉంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసారు. పెద్ది ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవడానికి కారణం జనసేన సభ అని అనుకుంటున్నారు అభిమానులు. బాబాయ్ కోసం చరణ్ త్యాగం చేసాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన తరపున నేడు జూన్ 2న గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభను ప్లాన్ చేసారు. అయితే ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పలువురు తెలంగాణ రాజకీయ నాయకులు కూడా పవన్ ని తిడుతూ ఈ సభ పెట్టొద్దు అంటూ కామెంట్స్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ సభ చర్చగా మారింది. Also Read : Dhanush : విజయ్ సీఎం అయిన వేళ.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్.. సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే ప్రెస్‌మీట్ నిర్వహిస్తానని ప్రకటించాడు. దీంతో ఇది మరింత పొలిటికల్ హీట్ ని పెంచింది. ఇలాంటి నేపథ్యంలో పెద్ది ప్రెస్ మీట్ కూడా అదే టైంకి పెడితే మీడియా కవరేజ్ లో జనసేనకు, పెద్ది సినిమాకు కూడా నష్టం కలుగుతుందని భావించి పెద్ది సినిమా ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి పవన్ జనసేన మీటింగ్ ఇంపార్టెంట్ అని పెద్ది సినిమా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. నేడు పవన్ కళ్యాణ్ జనసేన ప్రెస్ మీట్ తర్వాత రేపు ఉదయం పెద్ది ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. రేపు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి కాబట్టి ప్రెస్ మీట్ మొత్తానికే క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇప్పటిదాకా మూవీ టీమ్ అంతా కలిసి మీడియాతో మాట్లాడలేదు కాబట్టి రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది అని మీడియా సమాచారం.

Chitrajyothy02 Jun, 05:04 am
పెద్ది' మస్సా మస్సా.. లిరికల్ వీడియో సాంగ్ వ చ్చేసింది

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో రూపొందిన స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా చిత్రం పెద్ది (Peddi). ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి వ‌చ్చిన పాట‌ల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సినిమా నుంచి థీమ్ సాంగ్ మసా మ‌సా (Massa Massa Lyrical Video) అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్ (Anantha Sri Ram) సాహిత్యం అందించ‌గా రెహ‌మాన్ (A. R. Rahman) సంగీతంలో విషాల్ మిశ్రా (Vishal Mishra) ఆల‌పించాడు.

అయితే.. ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అయిన తీరును, చ‌ర‌ణ్ ప‌డిన క‌ష్టాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. పాట‌లోని సాహిత్యం సైతం ఆలోచింప‌చేసేలా ఉంది. ఈ పాంగ్ రిలీజ్ అయి త‌క్కువ స‌మ‌యంలోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.

Chitrajyothy02 Jun, 04:21 am
ఈ సారి నన్ను.. ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు! జాన్వీ పాప.. తెలుగులో ఇర గ దీసిందిగా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం విజయవాడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, అభిమానమే మమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలాచేస్తుంది అన్నారు.

ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే అంశాలను ‘పెద్ది’ చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను అలరించడం, నటించడం, మంచి సినిమాలు చేయడం. నా గుర్తింపు కూడా మీ అందరితో ఎంతో బలంగా ముడిపడి ఉంది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరందరూ గర్వపడేలా మరిన్ని మంచి పనులు చేస్తానని మాటిస్తున్నా అని పేర్కొన్నారు.

ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా.. రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి. జై చరణ్ అని అన్నారు. బుచ్చిబాబు గారు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. రెహమాన్ గారు ఒక లెజెండ్. మా నిర్మాత సతీష్ గారు ఈ మొత్తం ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘పెద్ది’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మీరు తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ఆస్వాదిస్తారు. ఈ సారి నన్ను మీరు ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు.

10TV Telugu02 Jun, 04:12 am
రామ్ చరణ్ 'పెద్ది'కి పోటీ వస్తున్న మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే

Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. చరణ్ కి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. అందుకే నార్త్ లో కూడా పెద్ది సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తుంది. నార్త్ ని కూడా టార్గెట్ చేసి ముంబై, భోపాల్, ఢిల్లీలో పెద్ది సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. అయితే టాలీవుడ్ లో, సౌత్ లో పెద్ది సినిమాకు ఎలాంటి పోటీ లేకపోయినా నార్త్ లో మాత్రం పెద్ది సినిమాకు పెద్ద పోటీనే ఉంది. Also Read : Peddi Collections : ఇలా అయితే కష్టమే.. పెద్ది కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. వరుణ్ ధావన్ హీరోగా మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న హిందీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా నార్త్ అంతా భారీగానే రిలీజ్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే ముగ్గురూ స్టార్స్. ఎంత కాదనుకున్నా ఈ సినిమా నుంచి పెద్దికి నార్త్ లో మాత్రం గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే పెద్ది జూన్ 4 రిలీజ్ అయితే ఇది జూన్ 5 కాబట్టి మొదటి రోజు మాత్రం నార్త్ లో పెద్దికి భారీగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుస్తుంది. మరి ఈ పోటీ తట్టుకొని పెద్ది నార్త్ లో నిలబడుతుందా లేదా చూడాలి.

Chitrajyothy02 Jun, 03:48 am
పెద్ది' సినిమాను వందసార్లు చూశా.. లాస్ట్ 40 నిమిషాలు టాప్ లేచిపొద్ది

రామ్ చ‌ర‌ణ్ ( Ram Charan) న‌టించిన పెద్ది (Peddi) చిత్రం మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌క‌ల‌కు ఎదుట‌కు రానుంది. ఈ నూప‌థ్యంలో మేక‌ర్స్ సోమ‌వారం విజ‌య‌వాడ‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా .. డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu) మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన మంత్రులకు, ఎంపీ కేసినేని చిన్ని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహంతో ఈ వేడుక అద్భుతంగా జరుగుతోంది. ఉప్పెన సినిమా చేసిన ఐదేళ్ల తర్వాత పెద్ది చేశాను. ఉప్పెనకు జాతీయ అవార్డు వచ్చింది, నిర్మాతలకు మంచి విజయాన్ని తీసుకొచ్చింది. ‘ఇంత సమయం ఎందుకు తీసుకున్నావు?’ అని చాలామంది అడిగారు. నేను పెద్ది కోసం తీసుకున్నాను. ఉప్పెన కథను కూడా విజయవాడలోనే రాసుకున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి.

నన్ను రామ్ చరణ్ గారి దగ్గర కూర్చోబెట్టిన మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఉప్పెనను నాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే, పెద్దిని రామ్ చరణ్ గారు ఇచ్చారు. ఈ కథ చెప్పిన తర్వాత చరణ్ గారు ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. అంత నమ్మకం ఉంచారు. పెద్ది ఒక కమర్షియల్ సినిమా లాగానే కనిపించినా, లోపల బలమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక ఆటగాడి ప్రయాణం, అతని ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటం, తన విజయం తన చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా మారుస్తుందనే కథ ఇది. పెద్ది ఎగిసిపడే మనిషి కథ కాదు... పడిపోయి మళ్లీ లేచే మనిషి కథ. నేను ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు వందసార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారీ ఎమోషనల్ అవుతాను. కళ్లల్లో నీళ్లు వస్తాయి. సినిమా చూసిన వాళ్లందరూ కూడా అదే చెబుతున్నారు.

జూన్ 4న ఈ సినిమా విడుదల అవుతోంది. కుటుంబ సమేతంగా వెళ్లి చూడండి. మీ పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే ఒక యువకుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది. పెద్ది సాధించే విజయం ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. జాన్వీ కపూర్ గారు ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఆమె నటనలో కూడా ఒక ప్రత్యేకమైన హీరోయిజం ఉంటుంది. ఇంత పెద్ద సినిమాలో నన్ను నమ్మి, ఒక్కరోజు కూడా ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాత సతీష్ కిలారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

జగపతి బాబు గారు చేసిన అప్పలసూరి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. రత్నవేలు గారు నేను రాసుకున్న ప్రతి అక్షరానికి ప్రాణం పోశారు. రామ్ చరణ్ గారి నటనను ఆయన అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఏఆర్ రెహమాన్ గారు అందించిన ప్రతి పాట ఇప్పటికే హిట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. రెహమాన్ గారితో పని చేయడం నా చిరకాల కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు. జూన్ 4న కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి పెద్దిని చూడండి. మీరు పెద్దిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. రామ్ చరణ్ గారి నటన చూస్తుంటే మీ కళ్లలో నీళ్లు రావడం ఖాయం. జూన్ 4న థియేటర్లలో కలుద్దాం.. ఎమోషనల్ అవుదాం అంటు ముగించారు.

AP7AM02 Jun, 03:14 am
విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్ పై 'పెద్ది' యూనిట్ ఫోకస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ఉద్ధృతం చేసింది. ఈ నెల‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్, సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్, దర్శకుడు బుచ్చిబాబు సానా, కీలక పాత్రధారులు జగపతి బాబు, దివ్యేందు శర్మ, నిర్మాత వెంకట సతీష్ కిలారు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, పాత్రల వివరాలను, చివరి నిమిషం అప్‌డేట్స్‌ను పంచుకోనున్నారు.విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'పెద్ది' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైల‌ర్‌, టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సరికొత్త లుక్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ఫ్యాన్స్

Eenadu02 Jun, 01:57 am
నేను చనిపోయే వరకూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా.. రాసిపెట్టుకోండి

ఇంటర్నెట్‌ డెస్క్: తనకు సినిమా తప్ప ఏం తెలియదని స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) అన్నారు. అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతానని చెప్పారు. ఆయన ప్రధానపాత్రలో బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’ (Peddi). జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. పెద్ది లాంటి కథ చాలా అరుదుగా వస్తుందన్నారు. అభిమానుల ఆనందం కోసం వారిని అలరించడం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పడతానన్నారు. తాను చనిపోయే వరకూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటానని తెలిపారు. ఈ వీడియో చూశారా: మైండ్‌ బ్లోయింగ్‌.. చరణ్‌ ఇంత కష్టపడ్డారా? ‘మస్స మస్స’ ఫుల్‌ సాంగ్‌

Sakshi02 Jun, 01:45 am
విజయవాడలో గ్రాండ్ గా పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పెద్ది సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్