translateexpand_more

Rashmika Mandanna News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy02 Jun, 10:32 am
బాబోయ్.. ఈ ముగ్గురి అల్లరి మాములుగా లేదు

షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాక్‌టెయిల్‌ 2’. హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైయాంకేజీలే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ (Cocktail 2 Trailer)ను మంగళవారం విడుదల చేశారు. దీనిలో రష్మిక, కృతి చేసిన అల్లరి చూసేయండి

Telugu Times02 Jun, 02:02 am
ర ష్మిక కెరీర్ హ య్యెస్ట్ రెమ్యూన రేష న్ ఎంతంటే

బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు ముందువరుసలో వినిపిస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికే తన స్థానాన్ని బలపరుచుకున్న రష్మిక, ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. గత కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో నిర్మాతలు, దర్శకుల దృష్టి ఆమెపై మరింతగా పడింది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల‌తో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ కథల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంటూ రష్మిక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కాక్‌టెయిల్2(Cocktail2) ఒకటి. ప్రముఖ డైరెక్ట‌ర్ హోమి అదజానియా తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో షాహిద్ కపూర్(Shahid kapoor), కృతి సనన్‌(Kriti Sanon)లతో కలిసి రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. మ్యాడాక్ ఫిలిమ్స్(Madock Films) నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్లామర్, భావోద్వేగాలు, వినోదం మేళవించిన కథతో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం రష్మిక అందుకున్న పారితోషికం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం కాక్‌టెయిల్2 కోసం ఆమె రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికంగా చెప్పబడుతోంది. వరుస స‌క్సెస్‌ల‌తో మార్కెట్ విలువ పెరగడంతో భవిష్యత్తులో హిందీ సినిమాల‌ కోసం ఆమె రెమ్యూన‌రేష‌న్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.