translateexpand_more

Romanchakam News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media29 May, 01:51 pm
సందీప్ రెడ్డి వంగా కొత్త మూవీ రొమాంచకం అఫీషియల్ అనౌన్స్ మెంట్

రొమాంచకం సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్ హీరోగా రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

NTV Telugu29 May, 01:37 pm
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం

Romanchakam: ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని ఆయన సోదరుడు, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. అయితే ఫస్ట్ టైం ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్‌తో కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తుంది. సందీప్ లాంటి డైరెక్టర్ సమర్పిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా “రోమాంచకం”. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తుండగా, సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని సమర్పిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు “రోమాంచకం” సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్‌ను సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘ఈ సినిమా కథ వింటున్నంత సేపూ నేను హాయిగా నవ్వుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఒక సినిమాను సమర్పిస్తున్నాను. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి ఒక వినూత్నమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ