translateexpand_more

Shiva Nirvana News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu01 Jun, 06:33 am
రవితేజ 'ఇరుముడి' మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ అప్డేట్

Irumudi Glimpse: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. క్లాస్, ఫ్యామిలీ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే సెన్సిబుల్ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో, టాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. Nabha Natesh: అబ్బబ్బా అనిపిస్తున్న నాభా నటేష్ అందాలు.. క్రేజీ ఫోటోలు వైరల్ ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మిస్తుండగా, వైవిధ్యమైన ట్యూన్స్‌తో దూసుకుపోతున్న జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమా కథాంశం ఎంతో వైవిధ్యంగా ఉండబోతోంది. అయ్యప్ప మాల ప్రత్యేకతతో పాటు, తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తాజాగా చిత్రబృందం ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో ఈ సినిమా అధికారిక గ్లింప్స్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్‌(Irumudi Glimpse)ను జూన్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయడంతో రవితేజ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Telugu Times01 Jun, 01:45 pm
రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్‌లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితర ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత కలగలిసిన ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది.

Chitrajyothy01 Jun, 07:14 am
రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

<p>శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ‌కు ఈ సినిమా ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. కారణం ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ ఆశలన్నీ ఇప్పుడీ ‘ఇరుముడి’పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. కచ్చితంగా ఈసారి మాస్ రాజాకు బ్లాక్‌బస్టర్ రాబోతోందంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేసింది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మరో ట్రీట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>జూన్ 3వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ (Irumudi Glimpse Date)ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో రవితేజ తన కుమార్తెతో కలిసి కూర్చుని ఉన్నారు. వారి బ్యాక్‌ సైడ్ మాత్రమే ఈ పోస్టర్‌లో చూపించారు. ఇప్పుడు రాబోయే గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అవుతాయని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.</p><br/><p>ఇప్పటి వరకు రవితేజ చేయని ఓ వైవిధ్యమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉందని టీమ్ చెబుతోంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని.. దర్శకుడు

SkyC Media30 May, 07:00 pm
రవితేజ ఇరుముడి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది

మాస్ మహారాజా రవితేజ 77వ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ ఇరుముడి సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రవితేజ ఒక శక్తివంతమైన అయ్యప్ప భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కి భిన్నంగా ఈ పాత్ర సాగనుంది. తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మే 2026 నాటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కీలకమైన షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దాదాపు ముగింపునకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో చిత్ర యూనిట్ తమ దృష్టిని పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టింది. దీనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి బజ్ లభించింది. రవితేజ ఇరుముడి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజను ఒక కొత్త కోణంలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తి, యాక్షన్ డ్రామా కలయికగా ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా సినిమా గురించిన చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. రవితేజ కొత్త లుక్స్, సినిమా వైవిధ్యమైన కథాంశం

NTV Telugu27 May, 06:52 am
టాలీవుడ్ లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్ లు.. నాని రవితేజ శర్వా

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August) నెల బాక్సాఫీస్ లైనప్ ఇప్పుడే చాలా సాలిడ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆగస్టు స్లాట్లను బుక్ చేసుకోగా.. తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన డేట్ల ప్రకారం బాక్సాఫీస్ బరిలో ఉన్న సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ప్రొమిసింగ్ ఫిలిం ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తర్వాత టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న భారీ చిత్రం ‘భోగి’ ఆగస్టు చివరి వారంలో, అంటే ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంది. ఇక గత కొన్ని చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ.. ఈసారి ఒక వినూత్నమైన కథతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) కూడా ఆగస్టు రేసులోనే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం ‘విశ్వంభర’ కూడా ఆగస్టు రేసులోకి వచ్చే అవకాశం ఉందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, జూన్‌లో ‘పెద్ది’తో మొదలయ్యే టాలీవుడ్

NTV Telugu27 May, 04:35 am
ఆగస్ట్ రేస్ లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీని భారీ స్థాయిలో ఆగస్ట్ 2026 లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజా. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు దైవికమైన అంశాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరగనుంది. రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన ఓల్డ్ ఏజ్ గెటప్‌లో రవితేజ కనిపించే సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయి. అలాగే సూపర్ హిట్ భక్తి గీతం ‘విల్లాలి వీరుడు’ సాంగ్ రీమేక్ కూడా ఉండబోతోందని వస్తున్న వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాయి. మరి ఈ సరికొత్త రస్టిక్ యాక్షన్ అస్త్రంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తన సాలిడ్ కమ్‌బ్యాక్‌ను ఎలా చాటుకుంటారో చూడాలి.

10TV Telugu29 May, 03:18 am
ఇక ఆలస్యం లేదు.. రవి తేజ కూడా వచ్చేస్తున్నాడు

Raviteja: తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే జూన్ నెల నుండి సినిమాల సందడి గట్టిగా షురూ కానుంది. ‘పెద్ది’ సినిమాతో మొదలయ్యే ఈ టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు ఆ తర్వాత కూడా వరుస విడుదలలతో హోరెత్తనుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలలను టార్గెట్ చేస్తూ ఇప్పటికే పలు భారీ చిత్రాలు కర్చీఫ్ వేశాయి. వర్షాల సీజన్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఆగస్టు నెల సినిమాలకు మంచి అనుకూలమైన సమయం కావడంతో, ఆ నెల రేసులోకి వచ్చే చిత్రాల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. Anna Lezhneva: మే నెలలో మధురమైన క్షణాలు.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన పవన్ భార్య అన్నా ఈ క్రమంలోనే ఆగస్టు బాక్సాఫీస్ బరిలో మాస్ మహారాజా రవితేజ(Raviteja) కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ని ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది.