translateexpand_more

Shiva Rajkumar News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 12:43 pm
గ్రాండ్ గా పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా చేరుకున్న అభిమానులు

పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.. విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Sakshi31 May, 08:35 am
అప్పుడు పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం చెబుతున్న విషయాలతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. చరణ్‌కు అవార్డుకు రావడం పక్కా అంటున్నారు. అలాగే క్లైమాక్స్‌ కన్నీళ్లును పెట్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక

TV9 Telugu01 Jun, 05:01 pm
మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు .. సక్సెస్ మీట్ లా ఉంది. విజయవాడలో చెయ్యాలని అనుకున్నాం.. ఇది మాకు లక్కీయాస్ట్ సిటీ.. ఆ లక్కు కోసమే ఇక్కడకి వచ్చాము.. పెద్ది అన్ని విజువల్స్ చూశారు.. ఎన్నో కథలు వింటుంటాం.. కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయ్.. కానీ పెద్ది కథ నా గుండెలను తాకిన కథ.. నిజంగా ఇలాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి వస్తాయ్. పెద్ది సినిమా చాలా చేసింది.. వ్యక్తిగతంగా నన్ను ఒక మంచి దారిలోకి మార్చింది.. ఒక యాక్టర్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..? బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ.. జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు.. ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

TV9 Telugu01 Jun, 04:45 pm
నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది టెన్షన్ గా ఉంది. న చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఉప్పెన తర్వాత ఐదేళ్ల తర్వాత సినిమా చేశా.. ఉప్పెనకు అవార్డు వచ్చింది.. ఇన్నేళ్లు ఎందుకు టైం తీసుకున్నా అంటే పెద్ది కోసమే తీసుకున్నా.. ఉప్పెన స్టోరీ ఇక్కడ విజయవాడలోనే రాశా.. ఉప్పెన తర్వాత ఎవరితో చేయాలా అనుకుంటున్నపుడు సుకుమార్ చరణ్ గారికి పరిచయం చేశారు.. దేవుడికి దండం పెట్టుకొని చరణ్ కు స్టోరీ చెప్పా.. పెద్ది కమర్షియల్ సినిమా కాదు.. ఇది ఎమోషనల్ మూవీ, ఒక ఆటగాడి సినిమా.. ఒక ఆట ఎలాంటి గుర్తింపు తెస్తుంది అనేది చూపిస్తుంది.. ఈ జర్నీలో చరణ్ గారితో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి.. రెండో సినిమాకే మీలాంటి స్టార్ ఇవ్వడం మాములు విషయం కాదు.. నా కథను నమ్మారు.. ఓ నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే అర్ధమవుతుంది. క్లైమాక్స్ చూసినప్పుడల్లా నాకళ్ళ వెంట నీళ్ళలొచ్చాయ్.. చాలా మంది అదే చెప్పారు. లాస్ట్ 40నిముషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుంది.. సినిమా జూన్ 4న విడుదలవుతుంది ఫ్యామిలీతో వెళ్లి చూడండి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ సినిమాలో చూస్తారు. నన్ను నమ్మినందుకు మిమ్మల్ని ఎప్పడూ మర్చిపోలేను.. జీవితంలో రుణపడి ఉంటా.. జానీ నటనలో హీరోయిజం ఉంటుంది.. క్లైమాక్స్ లో జాన్వీ నటన అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ గారు అందించిన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి.. ఈ సినిమాకు రెహమాన్ గారు మ్యూజిక్ చేయడం అనేది నా చిరకాల కోరిక అది పెద్దితో నెరవేరింది. రామ్ చరణ్ సార్.. మీరు లేకపోతే నేను లేను..అంటూ ఎమోషనల్ అయ్యారు బుచ్చిబాబు. ఫ్యామిలీతో సినిమాచూడండి.. పెద్దితో ఆడతారు, పాడతారు.. పెద్ది మీవెంట వస్తాడు.. చరణ్ గారి నటన చూస్తే మీకు కన్నీళ్లు కచ్చితంగా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.

NTV Telugu25 May, 11:52 am
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ...

Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగ...

NTV Telugu26 May, 01:58 am
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI)....

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస...

Samayam Telugu29 May, 10:12 am
మేం సినిమాల్లో మేకప్ వేసుకుంటాం.. నిజ జీవితంలో రంగులు మార్చం’.. పెద్ది’ నటుడు శివన్న కామెంట్స్

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్‌టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

10TV Telugu25 May, 11:20 am
Shiva Rajkumar interesting Comments About Ram Charan at peddi event Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్...

Shiva Rajkumar interesting Comments About Ram Charan at peddi event Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా (పెద్ది) బాక్సాఫీస్...

Chitrajyothy25 May, 06:18 pm
Home » South Cinema » Kannada » shiva rajkumar about pawan kalyan ram charan bonding at peddi event...

Home » South Cinema » Kannada » shiva rajkumar about pawan kalyan ram charan bonding at peddi event rcb ABN , Publish Date - May 25 , 2026 | 11:48 PM పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న బాం...

Samayam Telugu25 May, 04:42 pm
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో...

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డే...

AP7AM31 May, 10:47 am
ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తాను నటించిన 'పెద్ది' సినిమా గురించి ఒక భావోద్వేగ విషయాన్ని వెల్లడించారు. 2024లో తనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే, దర్శకుడు బుచ్చిబాబు సానా సహా చిత్రబృందం తన స్థానంలో మరొకరిని తీసుకోకుండా, తాను కోలుకునే వరకు ఎదురుచూశారని ఆయన గుర్తుచేసుకున్నారు.రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, "సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ బుచ్చిబాబు 'వద్దు, మీరే కావాలి' అన్నారు. వాళ్లు నా కోసం చాలా కాలం ఎదురుచూశారు. వారికి నా ధన్యవాదాలు" అని శివ రాజ్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కథ చెప్పిన రోజే రామ్ చరణ్‌తో కూడా మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.2024లో శివ రాజ్ కుమార్‌కు బ్లాడర్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన అమెరికాలోని మయామిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాన్సర్ సోకిన బ్లాడర్‌ను తొలగించి, పేగులోని కొంత భాగంతో వైద్యులు కృత్రిమ బ్లాడర్‌ను ఏర్పాటు చేశారు. 2025 ప్రారంభంలో ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్ నటన అద్భుతంగా ఉందని రామ్ చరణ్ ప్రశంసించారు. తాను సినిమాను చాలాసార్లు చూశానని, ముఖ్యంగా శివ రాజ్‌కుమార్‌పై చిత్రీకరించిన ఒక స్లో-మోషన్ సన్నివేశం బాగా గుర్తుండిపోయిందని అన్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ

SkyC Media28 May, 10:53 am
పెద్ది సినిమా పైరసీ నియంత్రణకు మద్రాస్ హైకోర్టు ఆర్డర్ జారీ

రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పైరసీ నివారణకు మద్రాస్ హైకోర్టు డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా పైరసీకి చెక్ పెట్టేలా మద్రాస్ హైకోర్టు సంచలన డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది! #peddi #ramcharan #peddimovie #buchibabusana #arrehman థియేటర్లలోనే సినిమా చూసి పైరసీని అరికట్టండి!

TV9 Telugu29 May, 03:57 pm
అప్పుడు చిరు రాజ్ కుమార్.. ఇప్పుడు చరణ్ శివన్న.. ఆ సీన్ రీక్రియేట్ చేసిన పెద్ది టీమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పక్కా మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు ట్రైలర్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ది ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా చరణ్, శివన్న కలిసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటో చూసి ఒకప్పుడు చిరంజీవి , కన్నడ హీరో కంఠీరవ రాజ్ కుమార్ అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు. టాలీవుడ్ హీరో చిరంజీవి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. అయితే గతంలో రాజ్‌కుమార్‌ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్‌ నిర్మాణ సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో కంఠీరవ రాజ్ కుమార్, చిరంజీవి ఇద్దరూ ఆప్యాయంగా కలుసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రాజ్ కుమార్ కలిసిన ఫోటోను

Eenadu29 May, 02:07 pm
చిరు- రాజ్ కుమార్ ల స్టిల్ .. రీ క్రియేట్ చేసిన చరణ్ - శివన్న

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi)- కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ (Kannada Actor Rajkumar)ల మధ్య మంచి అనుబంధం ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య రిలేషన్‌ కొనసాగుతూనే ఉంది. చిరు- రాజ్‌కుమార్‌ కలిసి నటించలేదు గానీ వారి వారసులు యాక్ట్‌ చేయడం విశేషం. ‘పెద్ది’.. ఈ ఇద్దరినీ కలిపింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్‌చరణ్‌ (Ram Charan), శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar).. ఇప్పుడు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌తో కలిసి స్పెషల్‌ చిట్‌చాట్‌లో సందడి చేశారు. ఇందులోనే.. కొన్నేళ్ల క్రితం రాజ్‌కుమార్‌- చిరంజీవికి సంబంధించిన స్టిల్‌ను చూపిస్తూ దానిని రీ క్రియేట్‌ చేయమని శివరాజ్‌కుమార్‌- చరణ్‌లను హోస్ట్‌ విజ్ఞప్తి చేశారు. వెంటనే శివన్న.. రామ్‌చరణ్‌ను హగ్‌ చేసుకుని, ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. సంబంధిత స్టిల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. హోస్ట్‌ చూపించిన ఫొటో.. రాజ్‌కుమార్‌ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్‌ నిర్మాణ సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో తీసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘భక్త కుంబార’ (1974)లో శ్రీదేవి బాలనటిగా యాక్ట్‌ చేశారు. శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించిన ‘పెద్ది’లో శ్రీదేవి తనయ జాన్వీ హీరోయిన్‌ కావడం విశేషం. ఆమెతో షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉందన్న శివన్న.. తమ కాంబినేషన్‌లో రెండు సీక్వెన్స్‌లు ఉంటాయని తెలిపారు. ‘పెద్ది’ విషయానికొస్తే.. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో శివన్న (శివరాజ్‌కుమార్‌) శిష్యుడిగా చరణ్‌ కనిపించనున్నారు. జూన్‌ 4న సినిమా విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు