
చెట్టును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.
© 2026 telugu.digital

ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.

Street Fighter trailer : జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ . కిటావో సకురాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. Shiva Jyothi : పింక్ శారీ, భారీ హారంతో యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు వైరల్.. నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది

ఆంగ్ల చిత్రం 'స్ట్రీట్ ఫైటర్' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. అక్టోబర్ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ నూ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం విడుదలైంది. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కాంబో ఛాలెంజ్ ద్వారా అభిమానులు ట్రైలర్ ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సిఎం చంద్రబాబు కీలక ప్రకటన తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ Stree Shakthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakthi Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం! మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు: మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 'దివ్యాంగశక్తి' సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు: ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Chandrababu naidu on free ac bus facility for women: ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే పలుచోట్ల రద్దీకి తగ్గట్టుగా బస్సలు లేకపొవడంతో కొన్ని చోట్ల మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. సీటు కోసం, బస్ స్టాప్ ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంత మంది అవసరంలేకున్న ఫ్రీఅని చెప్పి బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన అన్ని హమీలను నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సహాకారంతో ఏపీ డెవలప్ మెంట్ పథంలో వేగవంతంగా ముందుకుదూసుకుని పోతుందని చెప్పుకొచ్చారు. కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి గౌరవంగా అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు. మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్ నింగ్-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా గేర్ మార్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య కోహ్లీ కాదు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నాపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకస్మిక ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ధర్నాపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కేవలం తనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వైఖరి తీసుకుంటున్నారని, అక్కడ ఉన్న ఆధారాలు ఆయన మాటలకు సరిపోలుతున్నాయా అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన ఆమె.. వ్యవస్థను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా కేవలం నాటకీయ నిరసనలు తెలపడం రాహుల్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ నిశితంగా గమనిస్తూ పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు

అది అట్లాంటిక్ మహాసముద్రపు తీరం.. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల సప్పుడు తప్ప మనుషుల అలికిడే ఉండదు. వినడానికి ఏదో హర్రర్ సినిమాలో సైలెంట్ ఐలాండ్ లా అనిపించినా.. ఇది అమెరికాలోని మైనే తీరంలో ఉన్న విచ్ ఐలాండ్ (Witch Island) కథ! సరిగ్గా 18 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చిన్న దీవి వెనుక నమ్మశక్యం కాని ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునే స్థలంగా, ఆ తర్వాత దెయ్యాల దీవిగా ప్రచారంలోకి వచ్చి.. చివరకు ఒక రహస్య మహిళ చేతి నుంచి పక్షులు, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.1630ల కాలంలో డిక్సీ బుల్ అనే ప్రసిద్ధ సముద్రపు దొంగ తన దోపిడీ సొత్తును దాచడానికి ఈ దీవిని ఒక సీక్రెట్ స్థావరంగా వాడుకునేవాడని ఇక్కడ ప్రచారంలో ఉన్న పాత కథ. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఓడలు ఇక్కడే దాక్కునేవట. కాలక్రమేణా ఈ దీవి పలువురి చేతులు మారింది. అయితే 1887లో డానియల్, అన్నా చిట్టెండెన్ అనే దంపతులు వేలంలో ఈ దీవిని కొనుగోలు చేయడంతో దీని అసలు కథ ప్రారంభమైంది.ఎవరీ విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్?అన్నా అనే మహిళ జీవితం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చిన్నతనంలోనే కష్టాలు అనుభవించి, నాటకరంగంలో రాణించి, ఒక భారీ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా పెరుగుతాయో ముందుగానే ఊహించి చెప్పే విచిత్ర శక్తి తన వద్ద ఉందంటూ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు ఆమె జోస్యాలు విని పెట్టుబడులు పెట్టేవారు. దీంతో ప్రతిఒక్కరూ ఆమెను ప్రేమగా, భయంగా విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (వాల్ స్ట్రీట్ మంత్రగత్తె) అని పిలవడం

భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒకటిన్నర దశాబ్ద కాలంగా సాగుతున్న నిరీక్షణకు తెరపడింది. యువ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీ ద్వయం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా వీరు ఈ చారిత్రక ఘనతను సొంతం చేసుకున్నారు.ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో గాయత్రి - ట్రీసా జోడీ, చైనాకు చెందిన జియా యిఫాన్ - జాంగ్ షుక్సియాన్ జంటపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌ను 16-21 తేడాతో కోల్పోయినప్పటికీ, భారత ద్వయం అసాధారణ రీతిలో పుంజుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-15, 21-13 స్కోరుతో వరుసగా కైవసం చేసుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జోడీ, కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణులు పతకం సాధించడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2011లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన గాయత్రి, ట్రీసాతో కలిసి బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఒకవేళ సెమీ ఫైనల్లోనూ విజయం సాధిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా వీరు సరికొత్త చరిత్ర సృష్టిస్తారు