translateexpand_more

Varanasi News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media02 Jun, 12:08 pm
హైదరాబాద్ లో వారణాసి మూవీ కోసం ఐమాక్స్ కడుతున్న మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ విశేషాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాలతో షూట్ చేయడం విశేషం. నిజమైన 1.43:1 ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్న మొదటి ఇండియన్ మరియు నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని సాధారణ సినిమా లాగా తీసి ఆ తర్వాత ఐమాక్స్ లోకి మార్చడం లేదు. భారీ వర్టికల్ స్కేల్, ఎపిక్ ప్రపంచాలు మరియు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చూపించడానికి మొదటి నుండి ఐమాక్స్ కోసమే చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సరికొత్త దృశ్య అనుభూతిని ఈ సినిమా ద్వారా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోల వివరాలను పరిశీలిస్తే 1.43:1 రేషియో చాలా ప్రత్యేకమైనది. ఇది పెద్ద ఐమాక్స్ స్క్రీన్ల పూర్తి ఎత్తును కవర్ చేస్తూ 40 శాతం అదనపు వర్టికల్ ఇమేజ్‌ను ఇస్తుంది. ఇదిలా ఉండగా డిజిటల్ ఐమాక్స్ లో ఉండే 1.90:1 రేషియో వెడల్పుగా ఉండి 26 శాతం అదనపు ఇమేజ్‌ను మాత్రమే అందిస్తుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో మహేష్ బాబు భాగస్వామ్యంతో వస్తున్న సరికొత్త ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఐమాక్స్ స్క్రీన్ గురించి ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ కొత్త థియేటర్ కేవలం 1.90:1 ఫ్లాట్ డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఈ స్క్రీన్ పై పూర్తి స్థాయి 1.43:1 వర్టికల్ వెర్షన్ ప్రదర్శించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మహేష్ బాబు అభిమానులు వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ ను ఐమాక్స్ స్క్రీన్ లో చూడవచ్చు. అయితే రాజమౌళి షూట్ చేసిన పూర్తి స్థాయి పొడవైన వెర్షన్‌ను మాత్రం ఇక్కడి ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేరు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికతపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

10TV Telugu02 Jun, 06:57 am
వార ణాసి షూటింగ్ కు బ్రేక్ .. ప్రియాంక చోప్రా సండే ఫోటోలు వైర ల్

మహేశ్ బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వార‌ణాసి చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)న‌టిస్తోంది. షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికి కూడా ప్రియాంక త‌న కోసం కొంత స‌మ‌యం కేటాయించుకుంటుంది. పూల్‌లో రిలాక్స్ కావ‌డం, స్కిన్ కేర్‌, నేరేడు పండ్లు తినడం వంటి సండే రొటీన్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

Varanasi News Keyword | Telugu Digital