
Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?
Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?
© 2026 telugu.digital

Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?

పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్లో మొత్తం 463 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది. అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు. టీ20 క్రికెట్లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 430 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన కుటుంబంతో కలిసి కొన్నాళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా మ్యాచ్‌లు ఉన్నప్పుడు, ఐపీఎల్ సీజన్ సమయంలో మాత్రమే అతడు భారత్‌కు వస్తున్నాడు. దీంతో కోహ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే, విరాట్ భారత్‌ను వీడి విరాట్ లండన్‌లో నివసించడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డా.శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. లండన్‌కు వెళ్లడానికి ముందు అనుష్క శర్మతో జరిపిన ఆసక్తికర సంభాషణను డా.శ్రీరామ్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తమకున్న స్టార్డమ్ కారణంగా భారత్‌లో కోహ్లీ-అనుష్క సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని, అందుకే లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. పబ్లిక్ అటెన్షన్‌కు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోహ్లీ దంపతులు తమ పిల్లలు వామికా, అకాయ్‌లను మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణంగా పెంచాలనుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. వన్డే మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో భారత్‌కు వస్తున్నాడు. ఇక, 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత అనుష్క శర్మ నటనకు దాదాపు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటించారు. ఇందులో అనుష్క మాజీ భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించారు. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె 2022లో తన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ బాధ్యతల నుంచి వైదొలిగి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

Sachin vs Virat: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్‌లో సచిన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ తన వన్డే కెరీర్‌లోని 76వ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా విరుచుకుపడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్లో 10వ సెంచరీ నమోదైంది. డికాక్ మెరుపులతో బార్బడోస్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. డికాక్ బాదిన భారీ సెంచరీతో జట్టు విక్టరీ సాధిస్తుందని భావించినప్పటికీ మ్యాచ్ ఫలితం భిన్నంగా వచ్చింది. జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాన్సన్ చార్లెస్ 78 పరుగులతో రాణించగా, ఆండ్రీ ఫ్లెచర్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. లీగ్‌లో డికాక్ అత్యధిక పరుగులు చేస్తున్నప్పటికీ బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి రెండు విజయాలకే పరిమితమైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వీరిద్దరి ఖాతాలోనూ చెరో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో

Quinton de Kock: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డికాక్ తన టీ20 కెరీర్లో 10వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురి ఖాతాలో ఇప్పుడు చెరో 10 టీ20 శతకాలున్నాయి. టీ20ల్లో అత్యధిక సెంచరీల జాబితాలో డికాక్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 185.96 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన డికాక్ ధాటికి బార్బడోస్ 20 ఓవర్లలో 217/4 పరుగులు చేసింది. అయితే ఈ భారీ స్కోరును కూడా ఆ జట్టు కాపాడుకోలేకపోయింది. డికాక్ 57 బంతుల్లో 106 పరుగులు చేయగా.. 54వ బంతికి తన సెంచరీ పూర్తి చేశాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్ మూడు పరుగుల వద్ద పడినా, డికాక్, జకరీ కార్టర్ కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. కార్టర్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో బార్బడోస్ భారీ స్కోరు సాధించింది. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? కేవలం 18 బంతుల్లో 80 పరుగులు, సెంచరీకి ఎన్ని బంతులంటే? క్వింటన్ డి కాక్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 80 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడు. ఈ 18 బంతులు సిక్సర్లు, ఫోర్లతో నిండిపోయింది. డి కాక్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి, 185.96 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అతని

భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీ జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఒకరు. పబ్లిక్ అటెన్షన్ నుండి దూరంగా ఉండాలని ఈ జంట భావించింది. తమ పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వారు లండన్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2025లో డాక్టర్ శ్రీరామ్ నేనే, అనుష్కా శర్మతో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆమె తన విజయాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఆ సమయంలో పంచుకున్నారు. ఈ పాత సంభాషణ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరు తమ పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనుష్క శర్మతో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే 2025లో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విరాట్ కోహ్లీని ఎంతో వినయంతో ఉండే వ్యక్తిగా ఆయన ప్రశంసించారు. అనుష్కతో జరిగిన మాటలను గుర్తుచేసుకుంటూ, విపరీతమైన ప్రజాదరణ వల్ల సాధారణ జీవితం గడపడం ఎంతో కష్టంగా మారిందని ఆమె భావించినట్లు డాక్టర్ నేనే వివరించారు. వారు సాధించిన విజయం వల్ల వచ్చే నిరంతర దృష్టి వారి స్వేచ్ఛకు అడ్డంకిగా మారింది. విరాట్, అనుష్క ఇద్దరి కెరీర్లు అపారమైన విజయాన్ని చూశాయి. అయితే దానితో పాటే వారి వ్యక్తిగత జీవితం కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి, ప్రయాణాలు, పిల్లల జననం వంటి ప్రతి చిన్న విషయం అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటువంటి వాతావరణం నుండి దూరంగా ఉండి, పిల్bబాల్యం అందించడమే ఈ జంట లండన్ జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నది. 2017లో ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్‌ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్‌ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు మిలియన్‌కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి