translateexpand_more

Work Life Balance News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 02:49 pm
ఐటీ రంగంలో పని చేసి.. ఆటో డ్రైవర్ గా.. ఎందుకంటే

ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. కేరళకు చెందిన ఓ యువతి ఇదే కోవకు చెందుతుంది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె.. ఇప్పుడు ఆటో నడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల డాక్టర్‌ నెజ్రిన్‌ మిధ్లాజ్‌ అనే ఓ వ్యాపారవేత్త కంటపడింది. నెజ్రిన్ ఆ యువతితో మాట కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోకి ఓ క్యాప్షన్‌ జోడించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది నెజ్రిన్. అది వైరల్‌గా మారడమే కాకుండా.. నెటిజన్ల నుంచి చక్కటి స్పందన అందుకుంటోంది. ‘కొన్నిసార్లు అపరిచితులతో అనుకోకుండా మాట్లాడడం వల్ల స్ఫూర్తిదాయకమైన కథనాలు బయటకు వస్తుంటాయి. నాకు కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఈ రోజు ఒక మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశా. తను చక్కటి వస్త్రధారణతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఆమెను పలకరించా. పురుషాధిక్య రంగంలో పనిచేయడం ఎలా ఉందని అడిగా. దానికి ఆమె ఇచ్చిన సమాధానంతో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. ‘మేడమ్.. ఇప్పుడు చాలా బాగుంది. మహిళలుగా మనం చాలా ధైర్యవంతులం. మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం. నేను తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేశా. అయితే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత, వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ లేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ తర్వాత ఈ ఆటో కొని నడుపుతున్నా.

SkyC Media30 May, 10:07 am
ఐటీ ఉద్యోగం వదిలి ఆటో నడుపుతున్న డాక్టర్ నెజ్రిన్ మిథ్లాజ్

కార్పొరేట్ రంగంలో భారీ జీతాలు ఉన్నప్పటికీ ఒత్తిడి కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ నెజ్రిన్ మిథ్లాజ్ అనే మహిళ తన ఐటీ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్పొరేట్ ఐటీ ఉద్యోగాల్లో ఉండే మితిమీరిన పని గంటలు మరియు మానసిక ఒత్తిడిని భరించలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ సొంత షెడ్యూల్‌తో ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ నెజ్రిన్ మిథ్లాజ్ గతంలో ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఐటీ ఉద్యోగిగా సుదీర్ఘ కాలం విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె నిరంతరం ఆఫీస్ పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు రోజువారీ ఎక్కువ పని గంటల కారణంగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆమె తన మానసిక ప్రశాంతత కోసం ఆ ఐటీ ఉద్యోగం వదిలి పూర్తిగా బయటకు రావాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. ఆమె ఐటీ రంగాన్ని వీడిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆమె ఆటో నడపడం ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు ₹60,000 వరకు సులభంగా సంపాదిస్తున్నారు. సొంతంగా సమయాన్ని కేటాయించుకుంటూ పని చేయడం వల్ల తనకు ఇప్పుడు పూర్తి మానసిక ప్రశాంతత దొరికిందని నెజ్రిన్ చెబుతున్నారు. ఈ కొత్త వృత్తి ద్వారా లభిస్తున్న స్వేచ్ఛ మరియు సంతోషం కార్పొరేట్ కొలువులో లేవని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఆటో డ్రైవర్‌గా మారిన విశేషాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా నెటిజన్లు ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని మరియు ధైర్యాన్ని

Asianet News Telugu01 Jun, 11:57 am
ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్

Viral News : ఏకంగ 72 లక్షల రూపాయల జీతమిచ్చి ఉద్యోగం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. ఇలాంటి జాబ్ ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాత్రం ఈ భారీ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగులకు కేవలం జీతం మాత్రమే ముఖ్యం కాదని… వర్క్ కల్చర్, ఇతర సౌకర్యాలు కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోంది. కళ్లు చెదిరే ప్యాకేజీల కన్నా ఇవే ముఖ్యమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాగిణి పాండే అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ 'X' (గతంలో ట్విట్టర్)లో ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి, రూ.72 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. ఆ స్క్రీన్‌షాట్‌లో, మనీష్ అనే రిక్రూటర్... ఆఫర్‌ను అంగీకరించమని, మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని కోరడం కనిపిస్తుంది. కానీ ఉద్యోగ నియమ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆ డెవలపర్ ఈ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆ డెవలపర్ వివరించాడు. సరైన లీవ్ పాలసీ లేకపోవడం, ప్రస్తుత జీతంతో పోలిస్తే తక్కువ హైక్ ఉండటం, వేరే ప్రాంతానికి మారడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను అతను ప్రస్తావించాడు. ''ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోంది" అని అతను స్పష్టంగా చెప్పాడు. రూ.72 లక్షల ప్యాకేజీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రాధాన్యాలకు ఇది సరిపోదని ఆ డెవలపర్ నొక్కి చెప్పాడు. "జీవన వ్యయం, రిలోకేషన్ బోనస్ లేకపోవడం, లీవ్ పాలసీ

TV9 Telugu30 May, 06:09 am
ఉద్యోగం పోయిందని సంబరాలు.. ఇప్పుడే నా జీవితం మొదలైంది అంటున్న యువతి

ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళనతో ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. అమెరికాలో మెటా కంపెనీలో నాలుగేళ్లు పని చేసిన ఆశా ఈ మధ్య లేఆఫ్‌ అయింది. ఇలాంటి సమయంలో బాధపడాల్సింది పోయి ఆమె మాత్రం సంతోషంతో మనసులో మాట బయటపెట్టింది. పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నా ప్రతి రోజూ ఓకేలా జరిగే మీటింగ్స్‌ గంటల కొద్దీ కూర్చుని డాక్యుమెంట్లు తయారుచేయడం విసుగనిపించాయనీ తెలిపింది. బయటికి మంచి జీవితం కనిపించినా లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపింది. రొటీన్ వర్క్‌తో లోలోపల చనిపోయినట్లు ఫీలయ్యేదానినని ఆ బాధతో కుంగిపోయాననీ చెప్పుకొచ్చింది. ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన..క్రియేటివ్‌ పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది. ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలు బయటపడినట్లయింది. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటున్నారు. “డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో చర్చ నడుస్తోంది. మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

TV9 Telugu25 May, 11:01 am
సాధారణంగా మనకు ఆదివారం ఎలా గడుస్తుంది? వారమంతా పేరుకుపోయిన బట్టలు ఉతకడం, ఇంట్లో మూలమూలలా పేరుకున్న దుమ్ము దులపడం, బంధువులు, స్నేహితులతో మాట్లాడటం.. ఇలాంటి...

సాధారణంగా మనకు ఆదివారం ఎలా గడుస్తుంది? వారమంతా పేరుకుపోయిన బట్టలు ఉతకడం, ఇంట్లో మూలమూలలా పేరుకున్న దుమ్ము దులపడం, బంధువులు, స్నేహితులతో మాట్లాడటం.. ఇలాంటి కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలతోనే సరిపోతుంది. దీంతో విశ్రాంతి కోసం ఎద...