translateexpand_more

Yash News

Latest updates from Telugu Digital news sources.

Sakshi03 Jun, 08:23 am
కేజీఎఫ్' యష్.. రూ.24 కోట్ల డీల్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ ‍స్టార్ హీరో యష్.. ప్రస్తుతం 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్నాడు. మరోవైపు హీరోగా నటించిన 'టాక్సిక్' రిలీజ్ కావాల్సి వచ్చింది. లెక్క ప్రకారం రెండోసారి వాయిదా పడిన తర్వాత జూన్ 4నే విడుదల అని అన్నారు గానీ ఇప్పటివరకు సౌండ్ లేదు అంటే కచ్చితంగా వాయిదా పడినట్లే. ఇవి అలా ఉండగానే యష్ దంపతులు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా) యష్, అతడి భార్య రాధిక పండిట్ కలిసి.. మహారాష్ట్రలోని ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రం అలీబాగ్‌లో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారు. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్‌ ప్రకారం అలీబాగ్ తాలూకా కమత్ గ్రామంలో ఉన్న భూమిని రూ.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ 18వ తేదీన అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అయింది. 5,289 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన రెండు అనుబంధ వ్యవసాయ భూములు ఇందులో ఉన్నాయి. ఆ స్థలంలో ఒక నివాస గృహ నిర్మాణం కూడా ఉన్నట్లు పత్రాలతో తెలిసింది. అయితే ఈ స్థలాన్ని ఇల్లు కట్టుకునేందుకు కొనుగోలు చేశారా? లేదంటే రియల్ ఎస్టేట్ కోసమా తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అలీబాగ్ ప్రాంతం సినీ ప్రముఖులు దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైకి సమీపంలో ఉండటంతో పాటు అందమైన కొంకణ్ తీర ప్రాంతం కారణంగా అలీబాగ్ హాట్ టాపిక్ అయిపోతోంది. (ఇదీ చదవండి: మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు.. సీఎం విజయ్ తో ఖుష్బూ) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు) 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ట్రంప్ కి అమెరికా కోర్ట్ బిగ్ షాక్.. 180 కోట్ల డాలర్ల ఫండ్స్ రద్దు.! పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ? భువనేశ్వరి గారు తన రెండు గాజులు ఇస్తుంటే ఎంతో ప్రేమ అనుకున్న.. మునిగిపోయిందన్న మునిగిపోయింది, పేర్ని నానితో రైతు సరదా సన్నివేశం

SkyC Media03 Jun, 06:54 am
క్యాన్సర్ తో బాధపడుతున్న వీరాభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన యష్

సినీ పరిశ్రమలో నటుడు హీరో యష్ మానవీయత మరోసారి స్పష్టంగా బయటకు వచ్చింది. క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా పోరాడుతున్న తన వీరాభిమాని సునీల్ గురించి ఆయన తెలుసుకున్నారు. దీంతో తన అభిమానిని పరామర్శించడానికి యష్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది సినీ నటులు తమ ఫాలోయర్స్‌ను కేవలం సంఖ్యలుగానే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో యష్ మాత్రం తన అభిమాని పడుతున్న బాధను వ్యక్తిగతంగా భావించి స్పందించారు. ఇదిలా ఉండగా ఈ స్టార్ నటుడు తన అభిమాని సునీల్‌కు నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఈ కాల్ ద్వారా బాధితుడికి ఎంతో మానసిక ధైర్యాన్ని అందించారు. అంతేకాకుండా సునీల్ క్యాన్సర్ చికిత్సకు అవసరమైన పూర్తి అండగా ఉంటానని ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హీరో యష్ మానవీయత చూసి అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే ఒక స్టార్‌ను సమాజంలో నిజమైన హీరోగా మారుస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఫలితంగా ఈ వార్త సోషల్ మీడియా వేదికగా చదివిన నెటిజన్లు ఎంతో బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ సాటి మనిషి బాధను గుర్తించడం నిజంగా గొప్ప విషయమని కొనియాడుతున్నారు. ఈ ఘటనతో హీరో యష్ మానవీయత నెట్టింట వైరల్ కావడంతో ఆయనకు మరింత కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో యష్ గారికి ఇంకా ఎన్నో యశస్సు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.

10TV Telugu03 Jun, 03:36 am
రియల్ హీరో అనిపించుకున్న 'కేజీఎఫ్' యశ్.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్

Yash: కన్నడ స్టార్, ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ వాస్తవానికి ఈ జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీనితో పాటు బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లోనూ యశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్‌తో ఆయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. Dancer Pandu: ‘ఢీ’ జోడి డాన్సర్ పండుకు ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ యశ్ (Yash)తన అభిమాని పట్ల చూపిన ఆత్మీయత అందరి హృదయాలను గెలుచుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన వీరాభిమాని, శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు అయిన సునీల్‌కు ఆయన స్వయంగా వీడియో కాల్ చేశారు. సునీల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యశ్, ధైర్యంగా ఉండాలంటూ అతనిలో కొత్త భరోసాను నింపారు. అభిమాన హీరో స్వయంగా మాట్లాడటంతో ఆ బాధితుడు ఎంతో ఆనందానికి గురయ్యాడు. అంతేకాకుండా, సునీల్ క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అన్ని సమయాల్లో తాను అండగా ఉంటానని యశ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టార్‌డమ్ తలకెక్కిన ఈ రోజుల్లో, ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయించి తన అభిమానికి కొండంత అండగా నిలిచిన యశ్ రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్‌కు సంబంధించిన విషయం సాషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యశ్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Yash News Keyword | Telugu Digital