
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు చెందిన మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) పోటీలు రెండో రోజు ఆదివారం కూడా ఉత్సాహంగా సాగాయి.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు చెందిన మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) పోటీలు రెండో రోజు ఆదివారం కూడా ఉత్సాహంగా సాగాయి.
ఉత్సాహంగా డబ్ల్యూఏపీఎల్‌ పోటీలు.. క్రికెట్‌ అభిమానులకు పండగ ఈనాడు, అమరావతి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే అర్ధసెంచరీతో అదరగొట్టిన రంగలక్ష్మి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)కు చెందిన మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యూఏపీఎల్‌) పోటీలు రెండో రోజు ఆదివారం కూడా ఉత్సాహంగా సాగాయి. మహిళా క్రికెట్‌ జట్లు నువ్వా.. నేనా అన్నట్లుగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆఖరి నిమిషం వరకూ విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. వరుసగా రెండో రోజు కూడా అమరావతి ఈ-ఛాంపియన్స్‌ జట్టు విజయదుందుభి మోగించింది. రంగలక్ష్మి మొదటి రోజు సెంచరీ చేయగా.. రెండో రోజు అర్ధ సెంచరీతో పరుగుల వరద పారించింది. నీరగట్టు అనూష, కాట్రగడ్డ దీక్ష కూడా అధిక స్కోర్లు సాధించి.. ఫోర్లు, సిక్స్‌లతో.. క్రీడాభిమానుల్లో ఉత్సాహం నింపారు. జట్టు బౌలర్లు కూడా చెలరేగిపోయి ప్రత్యర్థి రాయలసీమ జెన్‌స్టార్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ప్రధానంగా బౌలర్‌ పూజిత డబ్ల్యూఏపీఎల్‌లో ఆదివారం తొలి హ్యాట్రిక్‌ను సాధించి జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. ఆదివారం కావడంతో క్రికెట్‌ అభిమానులు భారీగా మంగళగిరి మైదానానికి చేరుకుని.. పోటీలను తిలకించారు. పోటీలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత వచ్చారు. గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ X వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ మధ్య ఆసక్తికరంగా ఆట అమరావతి ఈ ఛాంపియన్స్‌ ఉత్సాహం మోస్ట్‌ ఎకనమికల్‌ బౌలర్‌గా దేవిక టాస్‌ వేస్తుండగా ఆసక్తిగా చూస్తున్న డీసీపీ సరిత .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి