
గజరాజుల ఠీవి, అశ్వాల రాజసం, లక్షల మంది భక్తజనం, మంగళవాయిద్యాలతో తిరుమల మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవ కనులపండువగా సాగుతుంటుంది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

గజరాజుల ఠీవి, అశ్వాల రాజసం, లక్షల మంది భక్తజనం, మంగళవాయిద్యాలతో తిరుమల మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవ కనులపండువగా సాగుతుంటుంది.
గ జరాజుల ఠీవి, అశ్వాల రాజసం, లక్షల మంది భక్తజనం, మంగళవాయిద్యాలతో తిరుమల మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవ కనులపండువగా సాగుతుంటుంది. ఈ కోలాహలం మధ్య మూగజీవాలు బెదిరిపోకుండా ‘నిశ్శబ్ద సైన్యం’ శ్రమిస్తుంటుంది. శబ్దం లేకుండా, పొగ రాకుండా మత్తుమందు ఇచ్చేందుకు ‘కార్బన్‌ డయాక్సైడ్‌ డార్ట్‌ గన్‌’ వాడుతుంది. గన్‌లో సీఓ2 కాట్రిడ్జ్‌లను అమర్చి ట్రిగ్గర్‌ నొక్కగానే.. ఆకుపచ్చ రంగు బ్లో పైప్‌లోని గులాబీ రంగు గల సిరంజి శబ్దం చేయకుండా ఏనుగుకు గుచ్చుకుంటుంది. మత్తుమందు కండరాల్లోకి చొచ్చుకుపోతుంది. 50-100 మీటర్ల దూరంలోని జంతువును లక్ష్యంగా చేసుకోవచ్చు. బ్లో పైప్‌ను చెక్క బాక్స్‌లో భద్రపరుస్తుంటారు. ఏనుగుల చెవుల కదలికలు, తొండం, హావభావాల ఆధారంగా ఎస్వీ గోశాల డైరెక్టర్‌ శివకుమార్‌ పర్యవేక్షణలో కర్ణాటక వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ రంగనాథ్, కేరళకు చెందిన వెటర్నరీ సర్జన్‌ గిరిదాస్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల వన్యప్రాణి నిపుణుల బృందం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గిరిదాస్‌ 253 ఏనుగులకు శిక్షణ, వైద్యమందించి ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకోవటం విశేషం. సీఓ2 డార్ట్‌ గన్‌ తయారీకి రూ.1.25 లక్షలు ఖర్చవుతాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి







