

Ayushi Patel : తెలుగు సినీ పరిశ్రమలో కలియుగ పట్టణంలో సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఢిల్లీ భామ ఆయుషి పటేల్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. తన కొత్త సినిమా అనౌన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడింది.
ఆయుషి పటేల్ తన గురించి చెప్తూ.. సెయింట్ మేరీస్ హైస్కూల్లో చదివి, ఢిల్లీలోని అమిటీ యూనివర్సిటీలో బీటెక్ చేసి, లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాను. చదువుతో పాటు సినిమాలు, కళలపై ఆసక్తి ఉంది. నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తాను. ఇప్పటివరకు 23 దేశాలను తిరిగేసాను. ఈ ప్రయాణంలో వివిధ దేశాల సంస్కృతులు, జీవన విధానాలను తెలుసుకున్నాను. అలాగే భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకున్నాను. అది నా జీవితంలోని ప్రత్యేక అనుభవం అని చెప్పింది.
