Bigg Boss 10 Telugu Today September 20 Episode: రెండోవారంలో కృష్ణుడు నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడే చాలా మందికి తేడా కొట్టేసింది. డౌట్ లేకుండా ఈవారం కృష్ణుడు దుకాణం సర్దేస్తాడని. కానీ ఏమో బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కృష్ణుడు పుంజుకుని ఆడితే ఏంటి పరిస్థితి? పైగా రోహిత్‌తో తొలివారంలో గట్టిగానే పడింది కాబట్టి.. రెండో వారంలో ఆటాడిస్తాడేమో అని అనుకుంటూ.. ఫుల్ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు కృష్ణుడు. రెండోవారంలో ఎలిమినేట్ అయిపోయారు.