"ఇందు కోసం ఆ రేఖ మనల్ని ఎన్ని కష్టాలు పెట్టినా భరించాం, ఎన్ని మాటలన్నా సహించాం, చివరకు మన ఇంట్లోనే మనల్నే పని మనుషుల్ని చేసినా తట్టుకున్నాం.. కానీ ఈరోజు ఇందు ఈ విషయంలో రాజుకి సహాయం చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండీ. అసలు ఇందు ఇదంతా తెలిసి చేస్తుందో, తెలియక చేస్తుందో తెలీదు కానీ.. ఇందు మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తోందండి." అని అపర్ణ అంటుంది. దీంతో సుభాష్ మాట్లాడుతూ.. రాజు విషయంలో ఇందు అంత నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఏదోదో ఊహించుకుని, నువ్వు బాధ పడుతూ తనను బాధ పెడుతున్నావని అడుగుతాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని, ఇందు చెబుతోందిగా నిజానిజాలేంటో మీకు తెలుస్తాయని.. అప్పటి వరకు సైలెంటుగా ఉందామని చెబుతాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు. కానీ అపర్ణ మాత్రం అలాంటి సైలెంటుగా చూస్తూ ఉంటే.. ఇందు జీవితం నాశనం అయిపోతుందని అనగా.. ఏం మాట్లాడుతున్నావు నువ్వని సుభాష్ అంటాడు. దీంతో నేను ఇలా అంటేనే తట్టుకోవడం లేదు, మరి నిజంగా అది జరిగితే ఇందు పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటని అంటుంది అపర్ణ. ఇందు సంతోషంగా ఉండాలని మనం కోరుకున్నాం, అలా తను ఉండాలంటే నేనొక పని చేయాలని నిర్ణయించుకున్నాని చెబుతుంది. ఏం చేయాలనుకుంటున్నావని భర్త అడగ్గా.. ఇందును మనం ఎంత అడిగినా కూడా రాజుకు, ఆ అమ్మాయికి సంబంధం ఏంటని చెప్పడం లేదు, ఇకపై చెప్తుందనే నమ్మకం కూడా లేదని అంటుంది. అందుకే రాజుకి నిజం చెప్పేస్తానని, తను దుగ్గిరాల ఇంటి వారసుడిని, మన మనవడని, మన కూతురి కొడుకు, ఇన్ని కోట్ల ఆస్తికి అధిపతి అని నేను చెప్పాస్తానంటుంది. దీంతో సుభాష్.. అపర్ణా అనగా.. అవునండి ఈ విషయమే కాదు, రాజుకు, ఇందుకు పెళ్లి జరగలేదన్న విషయం మనకు తెలుసు అని కూడా చెప్పేస్తానంటుంది. ఇందు రాజును ప్రేమిస్తుందో, ఇందు ప్రపంచం తనే అని చెప్పేస్తానని వివరిస్తుంది. అప్పుడు నా మనవడు కచ్చితంగా సిరి గురించి నిజం చెప్తాడని, ఇందుకు అన్యాయం చేయడని అంటుంది. దీంతో సుభాష్.. ఇప్పుడు నువ్వు రాజుకు నిజం చెప్తే ఇందు హర్ట్ అవుతుందో అంటాడు. ఎందుకవుతుందండి అనగా.. నువ్వు ఇందు మనసును పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు అపర్ణ అంటాడు. ఇందు రాజు తన బావ అని తెలిశాక ఇష్టపడడం లేదని, రాజు ఇందును మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడే.. రాజు తనకి ఈ ఇంటి వారసుడనే విషయం చెప్పాలనుకుంటుంది ఇందు అని అంటాడు. అందుకే నువ్వు ఆవేశపడి రాజుకు నిజం చెప్పొద్దని వివరిస్తాడు. అనవసరంగా ఇందును బాధ పెట్టకని అనగా అపర్ణ కాదండీ అనగా.. లేదని సుభాష్ అంటాడు. ఇది ఇందు జీవితానికి సంబంధించిన విషయం అని.. తను ఒకటి అనుకుంటుందని, దాన్ని నువ్వు పాడు చేయకని చెబుతాడు. నేనిలా ఎందుకు అనుకుంటున్నానో అర్థం చేసుకో అంటాడు. దీంతో అపర్ణ కూడా సైలెంటు అయిపోతుంది. మరోవైపు అందరూ తింటుండగా.. అప్పుడే రాజు వస్తాడు. అది చూసిన రేఖ ఇక మనం స్టార్ట్ చేద్దామా అని భ్రమరంతో అంటుంది.రాజును కూర్చోమని ఇందు అనగానే.. శేషు ఏంటి అల్లుడు భోజనానికి రావడం కాస్త లేట్ అయింది అంటాడు. దీంతో భ్రమరం.. హా ఏముంది శేషు, తన మొదటి పెళ్లాం ఉందిగా, తనకు ఏవైనా కబుర్లు చెప్పి వస్తున్నాడేమో అంటుంది. అవును రాజు.. తినడానికి ఒక్కడివే వచ్చావేంటి, నీ మొదటి పెళ్లాం గదిలోనే ఉందా అని అడుగుతుంది. పాపం, అసేల నీ మొదటి పెళ్లాం గతం మర్చిపోయింది, చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది, అలాంటి తనను ఎలా వదిలేశావమ్మా, వెళ్లు వెళ్లి తీస్కురాపో పో అంటుంది మన అందరితో కలిసి తింటుందిగా అనగా.. అవసరం లేదు, తను ఎప్పుడు, ఎక్కడ తినాలో నేను చూస్కుంటానని అంటాడు. కానీ భ్రమరం మాత్రం అది కాదు రాజు అనగా.. వదినా ఎందుకు రాజును బలవంతం చేస్తావని రేఖ అంటుంది. సిరి ఎంతైనా తన మొదటి పెళ్లాం కదా, తన మీద ఎనలేని ప్రేమ ఉండి ఉంటుందే, రాజే తన గదిలోకి భోజనం తీసుకెళ్లి ప్రేమగా తనకి తినిపించాలనుకుంటున్నాడేమో అని చెప్తుంది. దీంతో అపర్ణ సీరియస్ అవుతుంది. కానీ అదేమీ పట్టనట్టు రేఖ.. ఎందుకు తన మూడ్ స్పాయిల్ చేస్తావంటుంది. ఆపై భ్రమరం.. నలుగురితో కలిసుంటేనేగా తనకి గతం గుర్తుకు రావడానికి ఛాన్స్ ఉండేదని, ఇలా గదిలో దాచుకుంటే ఏం వస్తుందని అంటుంది. అప్పుడే భూషణ్ మాట్లాడుతూ.. ఓహో మేము ఏమైనా అనుకుంటున్నామని అనుకుంటున్నావా రాజు, మేమేమీ అనుకోమని అంటాడు. ఇందునే కాంప్రమైజ్ అయ్యాక, మేమేం చేస్తామని చెప్తాడు. వెళ్లు, వెళ్లి తీస్కురాపో అనగా.. అవసరం లేదని రాజు అంటాడు. దీంతో భ్రమరం మళ్లీ తీస్కురాపో అంటుంది. ఇందు ఆపాలని చూసినా ఆగదు. అయినా తనిప్పుడు మనతో తింటే ఏమవుతుంది అనగా.. రాజు వెళ్లి సిరిని తీస్కురా అని ఇందు చెప్తుంది. దీంతో రాజు ఇందు అనగా.. పర్లేదు వెళ్లి తీస్కురా అంటుంది. అరే.. నీ మొదటి పెళ్లాన్ని తీస్కురమ్మని, రెండో పెళ్లామే చెప్తుంది కదా రాజు తీస్కురాపో, ఇంకా ఏం ఆలోచించకు అనగా.. ఇందు కూడా వెళ్లి తీస్కురమ్మంటుంది. దీంతో రాజు వెళ్లగా.. అపర్ణ ఫేస్ చూసి ఇప్పుడుంటుంది అసలు డ్రామా అని రేఖ అనుకుంటుంది. ఆపై వెంటనే ఏమైంది ఆంటీ అలా ఉన్నారని అడుగుతుంది. తినండని చెప్తుంది. మరోవైపు రాజు సిరిని తీస్కుని వస్తాడు. అప్పుడే భ్రమరం.. అదిగో రాజు తన మొదటి పెళ్లాన్ని తీస్కువస్తున్నాడని అంటుంది. టేబుల్ వద్దకు రాగానే సిరి కూర్చో అని ఇందు చెప్తుంది. ఆపై రాజు కూడా కూర్చుంటాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావని భ్రమరం అనగా.. మీరెవరని అడుగుతుంది సిరి. నేను నీకు వరసకు పిన్ని అవుతానని అనగా.. నీ పేరేంటని అడుగుతుంది సిరి. భ్రమరాంభ అని చెప్పగానే.. ఏంటి భ్రమరాంభా మీ పేరు అస్సలు సూట్ కాలేదని, నీకో మంచి పేరు పెడతానంటూ చెప్తుంది. ఏంటి నువ్వు పేరు పెడతావా అని శేషు అడగ్గా.. అవును పెడతానంటుంది సిరి. దీంతో ఏం పేరు పెడ్తావని శేషు అనగా.. నువ్వు ఎప్పుడూ డబ్బాలా వాగుతావు కాబట్టి నీ పేరు డబ్బా అంటుంది. ఏంటి డబ్బానా అనగా.. అవును బాలేదా అంటుంది. శేషు బాగుందని చెప్పగా.. భ్రమరం సీరియస్ అవుతుంది. అయితే ఈరోజు నుంచి నీ పేరు డబ్బా అంటుంది. ఇదుగో ఇక నుంచి మీరంతా ఈవిడను డబ్బా అనే పిలవాలని అంటుంది. ఆపై అనాన్ని ఇష్టం వచ్చినట్లుగా కలపగా.. ఏయ్ సిరి అలా కాదని అంటాడు రాజు. మరెలా అని సిరి అనగా.. ఇలా కలపాలని రాజు చూపిస్తాడు. నువ్వు చాలా బాగా కలుపుతున్నావ్, నువ్వే నాకు తినిపించు అంటుంది. దీంతో అంతా మరింత షాక్ అయి అటే చూస్తారు. తినిపించు మొగుడా అనగా.. ఏంటి మొగుడా అంటాడు. నా మొగుడ్ని మొగుడనే అంటానని సిరి చెప్తుంది. దీంతో అపర్ణ మరింతగా ఫీల్ అవుతుంది. శేషు అలా పిలవకూడదమ్మా అని చెప్పగా.. నేను అలాగే పిలుస్తాను, మొగుడా, మొగుడా, మొగుడా అంటూ కేకలు వేస్తుంది. అబ్బబ్బా.. మొగుడా అని ఎంత ముద్దుగా పిలిచావమ్మా.. నువ్వలా పిలిస్తే ఎంత ముచ్చటగా ఉందో అంటుంది భ్రమరం. అవునమ్మా.. ఇప్పటి నుంచి ఇలా పిలుస్తున్నావా, పెళ్లయినప్పటి నుంచి ఇలాగే పిలుస్తున్నావా అని భ్రమరం అనగా.. పెళ్లంటే ఏంటి డబ్బా పిన్ని అంటుంది సిరి. దీంతో భ్రమరం.. ఏయ్, నన్నాలా పిలిస్తే అనగా నేనలాగే పిలుస్తానంటుంది సిరి. దీంతో నాకు కోపం వస్తుందని భ్రమరం అనగా.. కోపం వస్తే ఏమవుతుంది డబ్బా పిన్నీ అంటుంది సిరి. అప్పడే శేషు కల్గజేసుకుని.. డబ్బా అంటాడు. దీంతో భ్రమరం కోపంగా శేషు అనగా.. తనతో నీకెందుకులే భ్రమరం అంటాడు. అమ్మా నువ్వు తినమ్మా అనగా.. మొగుడా నువ్వు తినిపించు అంటుంది సిరి. నువ్వే తినిపించాలి, తినిపించాలి, తినిపించాలని పట్టుబడుతుంది. మరోవైపు రేఖ స్పందిస్తూ.. అంతా అడుగుతుందిగా తినిపించు అంటుంది. సిరి కూడా పదే పదే తినిపించమని నోరు తెరవగా.. గతిలేక రాజు సిరికి ముద్దలు కలిపి పెడతాడు. అది చూసిన అపర్ణ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే భ్రమరం.. చూశారా అపర్ణ గారు రాజు సిరికి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో అంటుంది. ఇలాగే ఇలా ఎప్పుడైనా ఇందుకు తినిపించాడా అని అడుగుతుంది. లేదు కదా అంటుంది. ఎంతైనా మొదటి పెళ్లాం అంటే మొదటి పెళ్లామో, తన మీద ఉన్న ప్రేమ ఎక్కడుంటుందిలెండి అనగానే.. అపర్ణ సీరియస్గా భ్రమరాంభ అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సిరి తనెందుకు కోపంగా వెళ్లిపోయిందని అడగ్గా.. నువ్వొచ్చావు కదమ్మా అంటుంది భ్రమరం. అందుకే అలిగి వెళ్లిపోయింది అనగా.. తను అన్నం తినలేదు కదా, మరి తనకు ఆకలేస్తుంది కదా అని సిరి అనగా.. అవునని భ్రమరం అంటుంది. మరెలా అని సిరి అనగా.. నువ్వు రాజును మొగుడా మొగుడా అని పిలవగానే ఆవిడ కడుపునిండిపోయిందని చెప్తుంది భ్రమరం. దీంతో సిరి మరి నీ కడుపు నిండిపోలేదా అంటుంది. దీంతో నువ్వు తిను అనగా.. రాజు మళ్లీ సిరికి ముద్దలు పెడతాడు. మరోవైపు గదిలోకి వచ్చిన అపర్ణ.. ఛీ, ఛీ కొంచెం కూడా పద్దతి పాడు లేదంటూ సీరియస్ అవుతుంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అనగా.. సిరిని అడ్డు పెట్టుకుని ఆ రేఖ, భ్రమరాంభ రెచ్చిపోతున్నారని చెబుతుంది. మొదటి పెళ్లాం అదీ ఇదని తిక్కతిక్కగా మాట్లాడుతున్నారంటుంది. వాళ్లు అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నానండీ అని చెప్తుంది. అప్పుడే అక్కడకు సిరి అపర్ణ కోసం భోజనం తీసుకుని వస్తుంది. కోపం వచ్చిందా, నా మీద అలిగావా అంటుంది. నాతో మాట్లాడవా అంటూ నాతో మాట్లాడు అంటుంది. ఎందుకొచ్చావని అపర్ణ అనగా.. నీకోసమే అంటుంది సిరి. నువ్వు నా వల్లే తినలేదని ఆ డబ్బా పిన్ని చెప్పిందని అంటుంది. మళ్లీ నీకు ఆకలి వేస్తుంది కదా అందుకే తీసుకొచ్చానని అంటుంది. దీంతో అపర్ణ మనసు కరిగిపోతుంది. తిను, ఏంటలా చూస్తున్నావ్ తిను అంటుంది సిరి. కానీ అపర్ణ అలాగే చూస్తుండిపోగా.. ఓ నీకు తినిపించాలా, తినిపిస్తా అంటుంది. భోజనం కలిపి మరీ అపర్ణకు ముద్దలు పెడుతుంది. ఆపై చేతులు డ్రెస్సుకు తుడుచుకోబోతుండగా.. అలా కాదు నీళ్లతో కడుక్కోవాలని చెప్తుంది. కడిగి మరీ తీస్కురాగా.. మళ్లీ ప్లేటు చేతుకు అందించి తినమంటుంది. ఆపై సుభాష్ను చూస్తూ.. ఆయనెవరు అనగా, ఆయన మా ఆయన అని చెప్తుంది అపర్ణ. దీంతో సిరి మరి నువ్వెందుకు ఛైర్లో కూర్చున్నావని అడుగుతుంది సిరి. లేచి నడవొచ్చుగా అంటుంది. ఆ భగవంతుడు నా