
వినూత్నంగా ఆలోచించాలనే సంకల్పం ఉంటే, చెత్తను సైతం తాజ్ మహల్‌గా మార్చవచ్చు అని మాట చాలా మంది అంటూ ఉంటారు..సరిగ్గా అలాంటి పని చేశాడు ఒక డెంటిస్ట్.. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడానికి అతడు ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ఇటుకలకు బదులుగా, వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుకను నింపి వాటితో ఒక అందమైన ఆకట్టుకునే ఇల్లు నిర్మించారు. ఈ నిర్మాణం సాధారణ ఇటుకల ఇళ్ల కంటే దృఢంగా ఉంటుందని, భూకంపాలు, తుఫానులను తట్టుకోగలదని డా. పలాష్ పేర్కొన్నారు. ఈ వినూత్న ప్రయోగం పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా న
ఈ రోజుల్లో సొంతిల్లు నిర్మించుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, ఇటుకలు, ఇనుము ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వైద్యుడు పర్యావరణహితమైన సరికొత్త ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించవచ్చని నిరూపిస్తూ.. వేలాది ప్లాస్టిక్ బాటిళ్లతో ఒక అందమైన ఆశియాటాని నిర్మించారు.




