
ప్రతీ నెలా మీ అకౌంట్లో పీఎఫ్ సొమ్ము జమ అవుతుందా.. లేదా అనేది పరిశీలించడం లేదా.. అయితే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే.. కొన్నిసార్లు కంపెనీలు జమ చేయడంలో ఆలస్యం చేస్తాయి. కొన్నిసార్లు నెలల తరబడి వేయకుండా ఉండవచ్చు. దీంతో ప్రతీ నెలా చెక్ చేసుకోవాలి.
పీఎఫ్ అకౌంట్లో ప్రతీ నెలా మీ యజమాని వాటాతో పాటు మీ వాటా కూడా జమ అవుతూ ఉంటుంది. అయితే చాలామంది ప్రతీ నెలా ఇవి జమ అవుతున్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోరు. యూఏఎన్ యాక్టివేట్ చేసి అలాగే వదిలేస్తుంటారు. అయితే మీ అకౌంట్లో ప్రతీ నెలా డబ్బులు జమ అవుతున్నాయా.. లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే మీరు ప్రతీ నెలా చెక్ చేసుకోకపోతే మీకు ఏదైనా సమస్య ఉన్నా తెలియదు. దీంతో ఆలస్యంగా తెలుసుకుంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీ అకౌంట్లో ప్రతీ నెలా కాంట్రిబ్యూషన్ జమ అవుతుందా.. లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. అదెలా అనేది ఒకసారి చూద్దాం.





