రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ వ్యహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీల సస్పెన్షన్ను రద్దుచేస్తూ ప్రభుత్వం సెప్టెంబరు 15న అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. వీరిద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వేర్వేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోలు జారీ చేశారు. అయితే, పోస్టింగ్ విషయంలో ఇరువురిపై విచారణ, క్రమశిక్షణకు లోబడి ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు.





