
Srikakulam: మకరాంపురంలో నీలమణి దుర్గా ఆలయ ప్రతిష్ఠకు ఏర్పాట్లు!
Srikakulam: కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గా ఆలయం (పాతపట్నం అమ్మవారు) ప్రతిష్ఠా మహోత్సవం ఈనెల 7న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మఖరాంపురం గ్రామ రజక సంఘం, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర శ్రావణమాస బహుళ ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రయుత తులా లగ్న పుష్కరము నందు సోమవారము ఉదయం అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినట్లు రజక సంఘం సభ్యులు తెలిపారు.
నిలగిరి రామకృష్ణ సిద్ధాంతి ఆధ్వర్యములో వైదిక కార్యక్రమం, ప్రత్యేక పూజలు చేయనున్నట్లు చెప్పారు. భక్త మహాశయులందరూ విచ్చేసి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలని కోరారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead