
వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు.
హైదరాబాద్‌: వినాయక చవితి ( Ganesh Chaturthi ) సందర్భంగా ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దంపతులు తొలి పూజ చేశారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కమిటీ సభ్యులు గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్‌తో పూజలు చేయించారు. ఖైరతాబాద్‌ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు. మరోవైపు బడా గణేశ్‌ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





