
Invest Telangana Global Summit 2026 కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌తో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు Invest Telangana Global Summit 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్పో-2026ను నిర్వహించనున్నామని, దానిని ప్రారంభించేందుకు రాజ్‌నాథ్ సింగ్ హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణను ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రక్షణ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు ఈ ఎక్స్‌పోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనితో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయ రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలు, కొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలకు రాజ్‌నాథ్ సింగ్ హాజరు ఎంతో స్ఫూర్తినిస్తుందని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేయాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకారం అవసరమని తెలిపారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు కూడా ఎయిర్‌షోలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా రక్షణ శాఖ సహకారం అందించాలని తెలిపారు. భారత త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని సీఎం కోరారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రక్షణ రంగంలోని నూతన సాంకేతికత, సామర్థ్యాలు, స్వదేశీ తయారీ ఉత్పత్తులను పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులు తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. డీఆర్డీవోకు చెంది