
ఖైరతాబాద్ బడా గణేశ్(Khairatabad Ganesh)ను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
హైదరాబాద్: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ (Khairatabad Ganesh)ను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. ఈ భారీ గణనాథుడికి బుధవారం రాత్రి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మహిళలు భక్తి శ్రద్ధలతో మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీప ప్రమిదలను చేతిలో ఉంచి బడా గణేశ్‌కి మహా హారతి ఇచ్చారు. వైభవంగా సాగిన మహా హారతి కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.