
జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులను ఎవరూ సులభంగా ఖర్చు చేయరు. అందులో నుంచి రూపాయి తీయాలన్నా వందసార్లు ఆలోచిస్తారు. కానీ, చైనాకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు మాత్రం తన జీవిత కాలపు పొదుపు మొత్తాన్ని బ్యూటీ పార్లర్లో తగలేసింది. భారీ బిల్లును చూసి ఆమె కూతురు షాక్ అయింది. అవసరం లేకున్నా సర్వీసుల పేరుతో తన తల్లిని నిలువు దోపిడీ చేసారని కన్నీరుమున్నీరవుతోంది.
వయసు మీద పడినప్పటికీ యవ్వనంగా కనిపించాలనే ఆశతో ఒక బామ్మ బ్యూటీ పార్లర్లో భారీగా ఖర్చు పెట్టింది. వివిధ రకాల ట్రీట్మెంట్లు, కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకున్న ఆ బామ్మకు చివరకు ఏకంగా రూ. 4 కోట్ల బిల్లు రావడంతో కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా మైండ్ బ్లాకై షాక్కు గురయ్యారు. పార్లర్ లో ఆమె చేయించుకున్న సేవల వివరాల గురించి కూతురు వాకబు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.



