
Movie Profile
రణబాలి (Ranabali)
ఇంటర్నెట్ డెస్క్: రణబాలి, జయమ్మగా అలరించేందుకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సిద్ధమయ్యారు. వివాహం తర్వాత వీరిద్దరూ ఆన్‌స్క్రీన్‌ భార్యభర్తలుగా నటించిన సినిమా ‘రణబాలి’. అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది (Ranabaali Release Date). తాజాగా దీని షూటింగ్‌ పూర్తయినట్లు టీమ్‌ తెలిపింది. ఈ మేరకు కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా కోసం టీమ్‌ మొత్తం 130 రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడిందని దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ (Ranabaali Director) పోస్ట్‌ పెట్టారు. మరో 29 రోజుల్లో రణబాలి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని తెలిపారు. 2018లో రాహుల్‌ -విజయ్‌ ( Vijay Deverakonda ) కాంబినేషన్‌లో ‘టాక్సీవాలా’ రూపొందింది. దాని తర్వాత వీరి కాంబోలో తెరకెక్కిన రెండో చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ఇందులో విజయ్‌ తిరుగుబాటు యోధుడిగా కనిపించనున్నారు. 1870లో సాగే ఈ సినిమాలో హీరో పాత్ర ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని విజయ్‌ను ఎంపిక చేసుకున్నట్లు దర్శకుడు గతంలో తెలిపారు. ఇక హీరోయిన్ పాత్రకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటి కోసం చాలా చర్చించి రష్మికను ( Rashmika ) ఎంపిక చేసినట్లు చెప్పారు. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గౌతమ్‌ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక (Rashmika) ప్రధానపాత్రలో సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథ తెరకెక్కనుంది. రణబాలి, జయమ్మగా అలరించేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక సిద్ధమయ్యారు.





