
ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మైసా’ కోసం తన జీవితాన్ని ఇచ్చానని రష్మిక (Rashmika) చెప్పారు. ఇందులో రిస్క్‌తో కూడిన ఎన్నో సన్నివేశాల్లో నటించానని అన్నారు. తాజాగా జరిగిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నాకు ఎత్తులంటే భయం. కానీ, దర్శకుడు రియాలిటీ కావాలంటూ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి దూకమన్నారు. భయంతో వణికిపోయాను. ప్రతిరోజూ షూట్‌కు వెళ్లేటప్పుడు ఏం రిస్క్‌ చేయమంటారో అని భయపడేదాన్ని’’ అని చెప్పారు. దర్శకుల కథకు ప్రాణంపోయడానికి తాను ఎంత కష్టపడడానికి అయినా సిద్ధమేనన్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా (Mysaa) నవంబర్‌ 27న విడుదల కానుంది. ఈ వీడియో చూశారా: రష్మిక యాక్షన్‌ మోడ్‌.. ‘మైసా’ టీజర్‌ వచ్చేసింది ‘మైసా’ కోసం తన జీవితాన్ని ఇచ్చానని రష్మిక (Rashmika) చెప్పారు.