రాశిఫలాలు 21 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శోభన యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
రాశిఫలాలు 21 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శోభన యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. మకర రాశిలో చంద్రుడి సంచారం కారణంగా పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనిలో సహనంతో ఉండాలి. మరోవైపు మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందడం వల్ల కొంత ఉపశమనం లభించొచ్చు. ఉద్యోగులు తమకు అప్పగించిన ముఖ్యమైన బాధ్యత అప్పగించబడొచ్చు. సూర్యుడు, బుధ గ్రహాల అనుగ్రహంతో, మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే వాదనలకు దూరంగా ఉండాలి. పరిహారం : ఈరోజు ‘ఓం నమ శివాయ’ మంత్రాలను పఠించాలి. వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. మీకు ఉన్నతాధికారుల నుంచి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించొచ్చు. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం : ఈరోజు శివ లింగానికి జలాభిషేకం చేయాలి. మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు రావొచ్చు. పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది. శుభ యోగాల ప్రభావంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభించొచ్చు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. మీకు ధార్మిక పనులపై ఎక్కువ ఆసక్తి లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంటుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఇంటి సామాను లేదా నిత్యావసరాల కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. కుజుడు నీచ స్థానంలో ఉన్నందున మీకు సమస్యలు పెరగొచ్చు. గురుడి ఆశీస్సులు పరిస్థితిని స్థిరపరచడంలో సహాయపడతాయి. మీరు చేసే ప్రయత్నాలకు వెంటనే గుర్తింపు లభించకపోవచ్చు. ఉద్యోగులకు చంద్రుడు సహోద్యోగులతో మీ సంబంధాలను ప్రభావితం చేస్తాడు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. పరిహారం : ఈరోజు శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. సింహ రాశి వారికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఖర్చులు చేయకూడదు. మీరు పొదుపు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సూర్యుడు, బుధుడి కలయిక కారణంగా మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభించడం కంటే పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. మీ పనిని ప్రశాంతంగా కొనసాగించాలి. పరిహారం : ఈరోజు శివ లింగానికి జలాభిషేకం చేయాలి. కన్య రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం, తెలివితేటలు బాగా పెరుగుతాయి. మీకు స్టాక్ మార్కెట్ నుంచి లేదా పాత పెట్టుబడుల నుంచి ఆకస్మికంగా భారీ లాభాలు లభించొచ్చు. ఉద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభించొచ్చు. సమాజంలో మీకు కీర్తి, గౌరవం, హోదా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, మీకు కూడా గొప్ప విజయం లభిస్తుంది. శుభ యోగాల కారణంగా, కన్యా రాశి వారికి స్టాక్ మార్కెట్, పెట్టుబడి లేదా పాత ప్రాజెక్టులకు సంబంధించి ఆకస్మిక లాబాలు పొందొచ్చు. పరిహారం : ఈరోజు శివ లింగానికి బిల్వపత్రాలు సమర్పించి, పూజలు చేయాలి. తులా రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. శుక్రుడి అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రావొచ్చు. మీ పొదుపు అలవాట్లను పునఃపరిశీలించడం మంచిది. మకర రాశిలో చంద్రుడి సంచారం కారణంగా ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారం లభించొచ్చు. అయితే మీ తెలివితేటలతో అనేక సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈరోజు స్థిరాస్తి, భూమి లేదా కొత్త కారు లేదా ఇల్లు కొనాలనే చిరకాల కలలు నెరవేరొచ్చు. మీరు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందొచ్చు. మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు లభించొచ్చు. పరిహారం : ఈరోజు మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ పొదుపును బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టొచ్చు. చంద్రుడి సంచారం వల్ల మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బును క్రమశిక్షణతో ఖర్చు చేయాలి. మీ పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సూర్యుడు, బుధుడి ప్రభావంతో మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాలకు చిరాకు పడకండి. మీ ఉద్యోగాన్ని మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి. మకర రాశి వారికి శివుని అనుగ్రహం వల్ల గొప్ప ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. బుధుడి నక్షత్ర మార్పుతో వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కోరికలు నెరవేరొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడొచ్చు. చాలా కాలంగా కోల్పోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు పెంచుకోవడం మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వాహనం కొనాలనే చిరకాల కోరిక కూడా రేపు నెరవేరే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం, ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన యోగం కూడా ఏర్పడనుంది. పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి. కుంభ రాశి వారికి ఈరోజు రాహువు అనుగ్రహంతో సానుకూల ఫలితాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణం వల్ల కొన్ని ఖర్చులు పెరగొచ్చు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులు సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు బుధుడి అనుగ్రహంతో మీ పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించొచ్చు. పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి. మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితుల ద్వారా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శని తిరోగమనం కారణంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మకర రాశిలో చంద్రుడు సంచారం కారణంగా మీ లక్ష్యాలను పూర్తి చేసే అవకాశం ఉంది. పట్టుదలతో అనేక ప్రయత్నాలు ఫలప్రదం చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి