
మనలో చాలామంది ఎక్కడికైనా వెళ్లే ముందు Google Mapsలో రూట్ చెక్ చేస్తుంటారు. రోడ్డుపై ట్రాఫిక్ ఎంత ఉంది, ఎక్కడ జామ్ ఉంది, ఏ రూట్లో ప్రయాణిస్తే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు వంటి వివరాలను మ్యాప్స్ కొన్ని క్షణాల్లోనే చూపిస్తుంది. అయితే మనం వెళ్లకముందే రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో వీటికి ఎలా తెలుస్తుందనే సందేహం చాలామందికి ఉంటుంది.
ఇక భవిష్యత్తులో కొన్ని నిమిషాల తర్వాత ట్రాఫిక్ ఎలా ఉండొచ్చో అంచనా వేయడానికి చారిత్రక ట్రాఫిక్ నమూనాలతో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా AI, మెషిన్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా విశ్లేషిస్తుంది. అందుకే మీరు ఒక రూట్లో బయలుదేరిన తర్వాత ముందున్న రోడ్డులో ట్రాఫిక్ పెరుగుతుందని గుర్తిస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మ్యాప్స్ సూచించగలదు.