
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Gurugram : హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక మహిళా బైకర్‌ను కొందరు వ్యక్తులు తమ కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో నిందితుడి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారుతో ఢీకొట్టిన నిందితుడిని కల్యాణ్ బైంస్లా అనే యువకుడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. గురుగ్రామ్‌కు చెందిన ఒక యువతతి తన స్పోర్ట్స్ బైకుపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు కారులో ఆమెను వెంబడించారు. దీంతో ఆమె వారిని వారించింది. అయినప్పటికీ వారు వినిపించకోలేదు. కొంతదూరం వెళ్లిన తర్వాత గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఆమె బైకును కారుతో ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ బైకర్‌కు సంబంధించిన కెమెరాలో రికార్డైంది. అది కూడా ఆ బైకుకు అమర్చిన కెమెరాలో. ఈ వీడియోలో ఆ కారు నడిపిన వ్యక్తి కావాలని ఢీకొన్నట్లు అనిపిస్తుంది. ఈ ఘటనలో బైకు నుంచి కింద పడ్డ యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. You got to book this car driver under “hit and run” case @gurgaonpolice . Bring them to justice. 📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/KngHxTZ5ke — Yo Yo Funny Singh (@moronhumor) September 14, 2026 ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కారు నడిపిన నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఆమెను ఢీకొన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో, కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు, మీడియా నిందితుడి వివరాలు సేకరించారు. అతడు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కల్యాణ్ బైంస్లా అని తేలింది. దీంతో అతడు మీడియా ముందుకు వచ్చాడు. తాను కావాలని ఆమెను ఢీకొట్టలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. పైగా బైకు నడుపుతోంది యువతి అని తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Namasthe Telangana లో చూడండి






