
Jio-Canva Offer : జియో, కాన్వా భాగస్వామ్యంతో అర్హత కలిగిన యూజర్లకు 12 నెలల పాటు కాన్వా ప్రీమియం టూల్స్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Jio-Canva Offer : జియో, కాన్వా భాగస్వామ్యంతో అర్హత కలిగిన యూజర్లకు 12 నెలల పాటు కాన్వా ప్రీమియం టూల్స్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Jio-Canva Offer : జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్. ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ క్వాన్వాతో కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ డీల్‌తో అర్హత కలిగిన జియో కస్టమర్లు 12 నెలల పాటు క్వాన్వా ప్రీమియం క్రియేటివ్ టూల్స్‌ను యాక్సస్ చేయొచ్చు. ఇందుకోసం రూపాయి ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా డిజైన్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆఫర్లో భాగంగా రూ.399 జియో ప్లాన్‌తో క్వాన్వా ప్రో అందుబాటులో ఉంటుంది. అలాగే, రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న రోజువారీ 2GB జియో ప్లాన్లకు క్వానా ప్రో లైట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఆఫర్‌పై ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవని కంపెనీలు తెలిపాయి. 2026 సెప్టెంబర్ 16 నుంచి ఈ బెనిఫిట్ అందుబాటులోకి రానుంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి