
హైదరాబాద్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మణికొండలో ఉన్న బీఆర్సీ బిల్డింగ్ సమీపంలోని ఓ షాప్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భయపడిపోయిన జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపుచేశారు.
రంగారెడ్డి జిల్లా మణికొండలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీఆర్సీ బిల్డింగ్ సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే దుకాణం నుంచి మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.