
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:


KTR Arrest: తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ వర్గాల నిరసనలతో అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ హామీల అమలును డిమాండ్ చేస్తూ స్లోగన్లతో కూడిన నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు ప్రాంగణం గేటు వద్దే అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకే అభ్యంతరకర వాక్యాలు ఉన్న టీషర్టులతో లోపలికి అనుమతించలేమని భద్రతా సిబ్బంది స్పష్టం చేయగా, టీషర్టులు తొలగించేందుకు నిరాకరించిన బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తూ ము ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
BRS Protest: పబ్లిక్ గార్డెన్స్ వద్ద రణరంగం.. కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్
ఈ అనుకోని తోపులాట ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Injured)నుదురు, చేతికి తీవ్ర గాయాలవ్వగా, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాలికి గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ గేటు నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు తరలించారు. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు తెలంగాణ భవన్‌లోనే ఉండగా, సమాచారం అందుకున్న శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.తెలంగాణ భవన్‌కు గులాబీ నేతల తరలింపు.. ఆసుపత్రి చికిత్సకు కేటీఆర్ సిద్ధం!
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి