
VijaySethupathi | టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ (Maharaja) ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

VijaySethupathi | టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ (Maharaja) ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
Matthew McConaughey | టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ (Maharaja) ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తుంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కంటెంట్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన వార్తలపై చిత్ర నిర్మాత సుధాన్ సుందరం (Producer Sudhan Sundaram) స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మహారాజా రీమేక్ హాలీవుడ్ రైట్స్ కోసం అక్కడి ప్రముఖ ఏజెన్సీ మమ్మల్ని సంప్రదించినట్లు తెలిపారు. ప్రస్తుతం హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసే ప్రయత్నాలలో ఉంది. ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో మాథ్యూ మెక్కానగీ (Matthew McConaughey)తో పాటు మరికొంత మంది ప్రముఖ నటులతో చర్చలైతే నడుస్తున్నాయి. అయితే, ఏజెన్సీ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అని వెల్లడించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజా’ కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఒక తండ్రి తన కూతురు కోసం చేసిన పోరాటం, స్క్రీన్ ప్లే మ్యాజిక్ ప్రేక్షకులను విపరీతంగా కట్టపడేసాయి. ఇప్పుడు ఇదే కథ హాలీవుడ్లో ఏ స్థాయి వైవిధ్యాన్ని సృష్టిస్తుందోనని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Namasthe Telangana లో చూడండి





