
ఛత్తీస్గఢ్లోని బస్తర్లో పదమూడేళ్ల క్రితం మావోయిస్టులు జరిపిన దాడిలో (Maoist attack 2013) కాంగ్రెస్ నేతలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఛత్తీస్గఢ్లోని బస్తర్లో పదమూడేళ్ల క్రితం మావోయిస్టులు జరిపిన దాడిలో (Maoist attack 2013) కాంగ్రెస్ నేతలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పదమూడేళ్ల క్రితం మావోయిస్టులు జరిపిన దాడి (Maoist Attack 2013) కేసులో ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పది మంది మావోయిస్టులను ఇప్పటికే దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. వారికి మరణశిక్ష ఖరారు చేసింది. నాటి ఘటనలో కాంగ్రెస్‌ కీలక నేతలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దోషులుగా తేలిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మామను చంపించిన కోడలి కేసులో.. మరో ట్విస్ట్‌ బస్తర్‌ జిల్లాలోని ఝీరాం వ్యాలీలో (Jhiram Valley) 2013 మే 25న కాంగ్రెస్‌ నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీని లక్ష్యంగా చేసుకొన్న మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఆ ఘటనలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ దిగ్గజ నేతలు సహా 29 మంది మృతి చెందారు. నాటి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నంద్‌కుమార్‌ పటేల్‌, ఆయన కుమారుడు దినేశ్‌, అసెంబ్లీలో మాజీ విపక్ష నేత మహేంద్ర కర్మా, కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్‌ శుక్లా, సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌ ముదియార్‌ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణ సమయంలో దాదాపు 101 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి







