
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘రామాయణం’ ఒకటి. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది.
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారాములుగా రణ్బీర్ కపూర్, సాయి పల్లవి కనిపించి కనిపించి ఆకట్టుకోనున్నారు. తాజాగా రామాయణం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించారు. నదీ తీరంలో సీతారాములు ఆప్యాయంగా గడుపుతున్న అందమైన క్షణాన్ని ఈ పోస్టర్లో చూపించారు.





