
ఏపీలో పురపాలక సంఘాల(AP municipal election)కు రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ప్రక్రియ వేగవంతమైంది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఏపీలో పురపాలక సంఘాల(AP municipal election)కు రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ప్రక్రియ వేగవంతమైంది.
అమరావతి: ఏపీలో పురపాలక సంఘాల(AP municipal election)ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా మరో 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఫారం-1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 22న ప్రకటించాలని పేర్కొన్నారు. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపకల్పన చేయాలని సూచించారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత మొత్తం 17 నగర పాలక సంస్థలకు గాను విజయనగరం కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుగా పూర్తి కావడంతో అక్కడ సెప్టెంబరు 3 నాటికే ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. అలాగే, రాష్ట్రంలోని 106 పురపాలక, నగర పంచాయతీల్లో డిలిమిటేషన్ పూర్తయిన 58 చోట్ల కూడా సెప్టెంబరు 3నే జాబితాలను వెల్లడించారు. మిగిలిన 12 నగర పాలక సంస్థలు, 29 పురపాలక, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబరు 14 నుంచి 17 మధ్య పూర్తి కానున్నందున.. ఆయా చోట్ల ఓటర్ల జాబితా ప్రచురణకు కొత్త తేదీని ఖరారు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సెప్టెంబరు 13న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్ఈసీ.. సెప్టెంబరు 22ను ప్రచురణ తేదీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఓటర్ల జాబితాల ప్రచురణతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధం అవుతోంది. మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వానికి మరింత మార్గం సుగమం కానుంది. సంబంధిత కార్పొరేషన్ కమిషనర్లు , మున్సిపల్ కమిషనర్లు ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విశాఖపట్నంలో గణేశ్‌ నవరాత్రి (Ganesh Chaturthi) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రైలు (Train) ఎక్కుతూ జారిపడ్డ వ్యక్తిని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కాపాడిన ఘటన కాకినాడ (Kakinada) జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయకుడు (Ganesh Chaturthi) విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి