
యూపీఐ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు, డెబిట్ కార్టు చెల్లింపులపై ఛార్జీలు వేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాటి వాస్తవం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారు, క్రెడికార్లు చెల్లింపులపై డబ్బులు వసూలు చేస్తారని సోషల్ మీడియాలో జరుగున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లిరటీ ఇచ్చింది. యూపీఐలో రూ. 2,000 లోపు చేసే లావాదేవీలతో పాటు రూపే (RuPay) డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు వసూలు చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. బ్యాంకులు గానీ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు గానీ కస్టమర్లపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు వేసేందుకు వీల్లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007’లోని సెక్షన్ 10A ప్రకారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది.