
AUS vs BAN : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ జట్టును బంగ్లాదేశ్ జట్టు ఓడించింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో టస్టులో మొదటిరోజు ఆటలోనే విజృంభించారు. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 64 పరుగులకే కుప్పకూల్చారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను చెల్లాచెదురు చేశాడు. కేవలం 12 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ లో తొలి బంతికే వికెట్ తీసిన స్టార్క్.. నాలుగో ఓవర్ పూర్తయ్యేలోపు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మరోవైపు.. కమిన్స్ సైతం విజృంభించి మూడు వికెట్లు పడగొట్టాడు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital





